ఈటల చేతులెత్తేశారు; బహిరంగంగా చేరికల కమిటీపై విజయశాంతి సంచలనం!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి పార్టీ నేతల మధ్య అభిప్రాయభేదాలు బాహాటంగా చర్చనీయాంశంగా మారాయి. నిన్నటి వరకు బండి సంజయ్ కు ఈటల రాజేందర్ కు పడడం లేదని చర్చ జరిగితే ఇప్పుడు తాజాగా, విజయశాంతి చేసిన పోస్ట్ ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసింది.
ఈటల రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్ గా చేతులు ఎత్తేశారని హరీష్ రావ్ చెబుతున్నారని అని విజయశాంతి చేసిన పోస్ట్ ఇప్పుడు పార్టీలో చర్చకు కారణంగా మారింది. సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉండే విజయశాంతి తన ఆసక్తికరమైన పోస్ట్ లో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో హరీష్ రావు చేస్తున్న ప్రచారాన్ని ప్రస్తావించారు.

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు అని, చిట్ చాట్ లో ఈటల చెప్పారని, చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు అంటూ హరీష్ రావుని టార్గెట్ చేసిన విజయశాంతి గతంలో అనేక ఎన్నికలలో వచ్చిన ఫలితాలను ప్రస్తావించారు.నాటి దుబ్బాక, జిహెచ్ఎంసి, నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా, చేరికల కమిటీతో వచ్చాయా, ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా విశ్లేషించుకోవాలి అని సూచించారు.
బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు, బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమే అని విజయశాంతి పేర్కొన్నారు. చేరికల కమిటీ పేరు చెప్తూ, చిట్ చాట్ లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికి నిలవదు. ఇది హరీష్ రావు గారికి తెలియంది కాదు అంటూ హరీష్ రావు ను టార్గెట్ చేశారు.
బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్ లో ఈటల చెప్పారు,
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 30, 2023
చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ..... pic.twitter.com/G8ulVzUyTf
అయితే విజయశాంతి చేసిన ట్వీట్ లో చేరికల కమిటీతో వచ్చిన ఫలితం ఏమీ లేదని స్పష్టంగా చెప్పారు. గతంలో జరిగిన ఉపఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం వెనక చేరికల కమిటీ ప్రయత్నం ఏమీ లేదని, అది సాధించిన విజయం ఏదీ లేదని విజయశాంతి స్పష్టం చేశారు. మొత్తంగా ఈటల రాజేందర్ చేరికల కమిటీని అధికార బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్న సమయంలో, విజయశాంతి చేసిన ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారింది. ఓ రకంగా అది ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తుంది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications