ఆ ఒక్క మాటతో.. సీఎం రేవంత్ కు తెలుగు రాష్ట్రాల ప్రజలు క్లాప్స్..!

'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్న సూక్తిని మనం తరచూ చూస్తుంటాం.. తెలుగు భాషలో ఉన్న గొప్పదనం, కమ్మదనం ఇతర భాషలో లేదని చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో నేటి యువత సొంత భాషను మరచిపోతున్నారు. ఉద్యోగ, ఉపాధి వేటలో ఇంగ్లీష్.. తదితర ఇతర భాషలను నేర్చుకుంటున్నారు. ఆ భాషలోనే మాట్లాడుతున్నారు. అయితే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే తాజాగా దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్.. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలు పెట్టారు. అయితే వెంటనే.. కలెక్టర్ గారూ.. మీకు తెలుగు వచ్చు కదా అని అడిగారు. దానికి ఆమె వచ్చు సర్ అన్నారు.

అయితే తెలుగులో మాట్లాడండి.. అని సీఎం రేవంత్.. అధికారిణికి సూచించారు. ఇక్కడ ఉన్న వాళ్లంతా సామాన్య మహిళలని.. అలాంటప్పుడు ఇంగ్లీషులో మాట్లాడితే వారికి అర్థం కాదని.. తెలుగులో మాట్లాడాలని సూచించారు. దాంతో సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ తెలుగులో మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాలనపరంగానే కాకుండా అన్ని రకాలుగా తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ భావించినట్లు స్పష్టం అవుతోంది. సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Viral Moment Revanth Reddy Asks District Collector to Switch to Telugu Mid-Meeting

ఇక ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదటి దశలో భాగంగా డిసెంబర్ 9 లోపు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే రెండో దశలో మార్చి 1 నుంచి మార్చి 8 నాటికి పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు అందజేయాలని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+