హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఓపెన్: ఇది కింగ్ ఆహ్వానం
హైదరాబాద్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వస్త్రాలతోపాటు రెస్టారెంట్ల బిజినెస్ ఆయన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీలో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేసిన కోహ్లీ.. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ప్రారంభిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేప్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని ఆర్ఎంజడ్ ది లాఫ్ట్‌లో ఈ రెస్టారెంట్‌ను శుక్రవారం ప్రారంభిస్తున్నట్లు విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. మీతో కొన్ని కొత్త విషయాలను షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు.

'మేము ఇప్పటికే హైదరాబాద్ హైటెక్ సిట నడిబొడ్డుకు వచ్చేశాం. నాకు, వన్8 కమ్యూన్ అనేది కేవలం ఒక రెస్టారెండ్ మాత్రమే కాదు. ఇది హైదరాబాద్‌లోని ప్రజలను ఒకేచోటకు చేర్చడం మా ముఖ్య ఉద్దేశం' అని కోహ్లీ వ్యాఖ్యానించారు. తన రెస్టారెంట్‌కు విచ్చేయాలని ఆహ్వానించారు.
'మే 24న మేము మా తలుపులు తెరిచే సమయంలో, మీరు కమ్యూనింగ్ స్ఫూర్తిని అనుభవం పొందితే నేను చాలా సంతోషిస్తున్నాను.
మీరు కమ్యూన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా?
మీ రిజర్వేషన్‌లను ఇప్పుడే చేయండి. 9559071818, 9559081818' అంటూ ఫోన్ నెంబర్లను కూడా కోహ్లీ పేర్కొన్నారు.
కోహ్లీ రెస్టారెంట్ కావడంతో ఇప్పటికే ఆ రెస్టారెంట్ ను చూసేందుకు అనేక మంది వస్తుండటం గమనార్హం. ఇంతకుముందు బెంగళూరులో రెస్టారెంట్ ఓపెన్ చేశామని.. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నామని కోహ్లీ బిజినెస్ పార్ట్నర్ నర్ వర్తిక్ తీహార్ తెలిపారు.
కోహ్లీకి హైదరాబాద్ అంటే ఇష్టమని చెప్పారు. వీలైతే మరికొన్ని రోజుల్లో మరో రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇక వన్ 8 కమ్యూనల్ రెస్టారెంట్‌లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూ పెట్టామని ఆయన వెల్లడించారు. ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీ ఉంటుందని తెలిపారు. కోహ్లీకి మష్రూమ్ డిమ్ సమ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications