ఆమ్రపాలి పెళ్లి తేదీ ఫిక్స్... వెడ్డింగ్ కార్డు అదుర్స్!

Written By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి తన మిత్రుడైన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మను ఈనెలలో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

వీరి వివాహ తేదీ కూడా ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 18న ఐపీఎస్ సమీర్‌‌శర్మతో ఏడగులు వేయనుంది అమ్రపాలి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 7 వరకు ఆమ్రపాలి సెలవులో వెళ్లబోతున్నారు.

collector-amrapali

ఈ నెల 23వ తేదీన వరంగల్‌‌లో, 25న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కూడా ఆమె ప్రత్యేకంగా తయారు చేయించారు. ప్రత్యేక అతిథులకు మాత్రమే ఇవ్వనున్న ఈ ఆహ్వాన పత్రిక చాలా ఖరీదైనదిగా చెబుతున్నారు.

ఆ కార్డు మొదటి పేజీలో పెళ్లికి సంబంధించిన చిత్రాలను క్లాత్‌పై పెయింటింగ్ వేసి తీర్చిదిద్దారు. ఆమె కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమైన అతిథులకు విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆమె వరంగల్‌కు చెందిన ప్రముఖులను ఈ విందుకు ఆహ్వానించారు.

అయితే తన పెళ్లికి సంబంధించిన ఆహ్వాన ప్రతికలను కలెక్టర్ ఆమ్రపాలి రెండు రకాలుగా ప్రింట్ చేయించారు. ప్రముఖులకు ఖరీదైన కార్డు, మిగతా వారికి మామూలు కార్డులను ఫ్రింట్ చేయించినట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Warangal Urban Collector Amrapali Wedding date fixed. On 18 February 2018 she is going to marry IPS Officer Sameer Sharma. She applied for leave from February 15 - March 7. Amrapali is arranging a Feast to her Frieds and Relatives on 23rd February in Warangal and on 25th in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి