వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్ న్యాయస్థానం సంచలన తీర్పు ..బీజేపీనేత హత్యకేసులో ప్రస్తుత సర్పంచ్ తో పాటు 15 మందికి జీవిత ఖైదు

|
Google Oneindia TeluguNews

వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బీజేపీ నేత ముచ్చర్ల గ్రామానికి చెందిన గౌరు అశోక్ రెడ్డి హత్య కేసులో న్యాయస్థానం 16మందిని దోషులుగా నిర్థారించింది. దోషులందరికీ జవిత ఖైదు విధిస్తూ... న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఒక కేసులో ఇంత మందికి జీవిత ఖైదు విధించటం వరంగల్ న్యాయస్థాన చరిత్రలో ఇదే తొలిసారి కావటం గమనార్హం.

2011లో ముచ్చర్ల నాగారం గ్రామంలో బొడ్రాయి పండుగ వివాదం .. బీజేపి నేత గౌరు అశోక్‌రెడ్డి దారుణ హత్య

2011లో ముచ్చర్ల నాగారం గ్రామంలో బొడ్రాయి పండుగ వివాదం .. బీజేపి నేత గౌరు అశోక్‌రెడ్డి దారుణ హత్య

ఇక అసలు విషయానికి వస్తే... 2011లో ముచ్చర్ల నాగారం గ్రామంలోజరిగిన గ్రామ బొడ్రాయి పండుగ సందర్భంగా బీజేపీనేత గౌరు అశోక్ రెడ్డికి, స్థానికంగా ఉన్న కొందరికి మధ్య వివాదం తెలత్తింది. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకున్నఅశోక్ రెడ్డిపై కక్ష పెంచుకున్న నిందితులు 16 మంది దారికాచి ముకుమ్మడిగా మారణాయుధాలతో దాడి చేసి అశోక్ రెడ్డి ని హతమార్చాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా హసన్‌పర్తి మండలం ముచ్చర్ల నాగారం గ్రామ పొలిమేరలో 2012 మార్చి 4న సాయంత్రం అదే గ్రామానికి చెందిన బీజేపి నేత గౌరు అశోక్‌రెడ్డి భార్యా పిల్లలతో బైక్ పైవెళుతుండగా ముచ్చర్ల నాగారం గ్రామానికి చెందిన పదహారు మంది నిందితులు ఇనుపరాడ్లు, కర్రలు, క్రికెట్ బ్యాట్లతో కుటుంబ సభ్యుల ఎదుటే దారుణంగా హతమార్చారు.

మారణాయుధాలతో హతమార్చిన నిందితులు .. 16 మందకి జీవిత ఖైదు విధించిన కోర్టు

మారణాయుధాలతో హతమార్చిన నిందితులు .. 16 మందకి జీవిత ఖైదు విధించిన కోర్టు

దారి కాచి, వెంబడించి , ప్రాధేయపడినా విడిచిపెట్టకుండా నిర్దాక్షిణ్యంగాహత్య చేశారు.భర్త అశోక్ రెడ్డి పై జరుగుతున్న దాడిని అడ్డుకున్న భార్య మమత కు తీవ్ర గాయాలయ్యాయి.ఆ ఘటనలో అశోక్ రెడ్డి అక్కడికక్కడే మరణించారు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసును ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీధర్‌రెడ్డి వాదించారు. ఈ కేసులో మొత్తం 24 మందిని విచారించిన అనంతరం ఈ కేసులో సంబంధం ఉన్న మొత్తం 16 మంది నిందితులకువరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సంచలన తీర్పు వరంగల్ జిల్లా లో హాట్ టాపిక్ గా మారింది. వారిలో ప్రధాన నిందితుడుప్రస్తుత ఆ గ్రామ సర్పంచ్ కొండపాక బిక్షపతి అలియాస్ రఘు కు సైతం జీవిత ఖైదు పడింది.

ప్రస్తుత సర్పంచ్ తో పాటు మరో 15 మందికి జీవిత ఖైదు

ప్రస్తుత సర్పంచ్ తో పాటు మరో 15 మందికి జీవిత ఖైదు

ఇక బండారి రాజు, గౌరి భగవాన్‌రెడ్డి, చిలువేరు అశోక్, బండారి గణేష్, కుక్కుమూడి జయరాజ్, దామెర రాజ్‌కుమార్,కోరేడి సమ్మిరెడ్డి, బొద్దుకూరి సమ్మయ్య, మెరుగు రాజు, రావుల కరుణాకర్, దున్నపోతుల శ్రీకాంత్, గంటి రాజేంద్రప్రసాద్, గౌరి యాదగిరి రెడ్డి, దామెర యాదగిరి, బండారి సారయ్య శిక్ష పడినవారిలో ఉన్నారు.ఈ కేసులో దోషులకుజీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తిరుమల దేవి తీర్పునిచ్చారు.

అయితే ఇప్పటివరకు వరంగల్ జిల్లా కోర్టులో ఇలా జడ్జిమెంట్ ఇవ్వటం ఇదే ప్రధమం . ఇంత మందికి ఒకేసారి యావజ్జీవ కారాగార శిక్ష విధించి సంచలన తీర్పు వెల్లడించారు జిల్లా న్యాయమూర్తి .

English summary
The Warangal District Court issued a sensational judgment. The court convicted 16 persons in the murder of Gauri Ashok Reddy, a BJP leader from Muchherla naagaram village. The guilty verdict was sentenced to life imprisonment. It is the first time in the history of the Warangal court that it has been sentenced to life imprisonment to 16 members at a time .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X