ముంపు ముంగిట ఓరుగల్లు.. తాజా పరిస్థితి ఇలా!

ఉమ్మడి వరంగల్ జిల్లా వర్షాలతో అతలాకుతలం అవుతోంది. హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఓరుగల్లులో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత కుండపోతగా కురిసిన వర్షం ఓరుగల్లు వాసులను వరద ముంపుకు గురి చేసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు.

ఉమ్మడి వరంగల్ లో వాన బీభత్సం.. ఇద్దరు మృతి
వరంగల్ నగరంలో వరద ఆ నీటిలో మునిగి ఒక వృద్ధురాలు మృతి చెందింది. ఇక నేడు రేపు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నేడు, రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

warangal floods heavy rains expected for two more days schools closed Key alert

పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాల ప్రజలు
అధికారులు స్వయంగా నీట మునిగిన ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరంగల్ నగరంలోని అధికారులు రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి, సెలవులు రద్దుచేసి ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే అధికారులకు సూచించారు.

అన్ని జిల్లాలలో కంట్రోల్ రూమ్స్
రానున్న 72గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి కలెక్టరేట్ల పరిధిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటుచేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ నగరంలో డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపడుతున్నారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, జిల్లా కలెక్టర్ లు ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలకు భరోసానిస్తూ సహాయకచర్యలు చేపడుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెడ్ అలర్ట్
భారీ వర్షానికి నిన్న వరంగల్ రైల్వే స్టేషన్ నీట మునగగా, ప్రస్తుతం కాస్త పరిస్థితి మెరుగుపడింది. అయితే నేడు రేపు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో తిరుగుతూ ముంపు ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో స్థానికంగా ప్రజలు వరద ముంపు పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+