వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ వెహికిల్ ఇన్సూరెన్స్ రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు; ఏడుగురు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

కాదేదీ దందాకు అనర్హం అని భావిస్తున్న అక్రమార్కులు యదేచ్చగా అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. వీరి తీరుతో ఏది అసలు, ఏది నకిలీ అని తెలుసుకోవడం పెద్ద కష్టం గా మారింది. చివరకు వాహనాలకు చేసుకునే ఇన్సూరెన్స్ లను కూడా నకిలీ చేస్తున్న గ్యాంగులు వరంగల్ జిల్లాలో ఎక్కువయ్యాయి. ఇప్పటికే అనేక మార్లు వీరిపై ఉక్కు పాదం మోపడానికి ప్రయత్నించిన పోలీసులు పదే పదే దాడులు కొనసాగిస్తున్నారు.

మైనర్లు మేజర్లుగా విచారణ: అమ్నీషియా పబ్ అత్యాచారం కేసులో జువైనల్ జస్టిస్ బోర్డ్ సంచలనతీర్పుమైనర్లు మేజర్లుగా విచారణ: అమ్నీషియా పబ్ అత్యాచారం కేసులో జువైనల్ జస్టిస్ బోర్డ్ సంచలనతీర్పు

వరంగల్ లో నకిలీ వాహన భీమాలు.. దాడులు చేసిన టాస్క్ ఫోర్స్

వరంగల్ లో నకిలీ వాహన భీమాలు.. దాడులు చేసిన టాస్క్ ఫోర్స్


వరంగల్ జిల్లాలో కమిషనరేట్ పోలీసులు నకిలీ వాహన ఇన్సూరెన్స్ పత్రాలను తయారు చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు. గతంలో నకిలీ వాహన భీమాలు చేసిన ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు మళ్లీ ఇప్పుడు వరంగల్ రవాణా శాఖ కార్యాలయం పరిసరాల్లోని ఆన్లైన్ కేంద్రాలు, దళారుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడులలో నకిలీ వాహన బీమా పత్రాలతో మోసపూరిత దరఖాస్తులు చేస్తున్నారన్న కారణంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఏడుగురు అరెస్ట్ .. పలు పత్రాలు స్వాధీనం

ఏడుగురు అరెస్ట్ .. పలు పత్రాలు స్వాధీనం


వరంగల్ రవాణా శాఖ కార్యాలయం పరిసరాల్లో ఆన్లైన్ కేంద్రాలు, దళారుల దుకాణాలపై దాడులు జరిపిన టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి దుకాణాలలో సోదాలు జరిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ పత్రాలు సృష్టిస్తున్నారని దాడులు జరిపిన టాస్క్ ఫోర్స్ అధికారులు అనుమానం వచ్చిన ఏడుగురిని అరెస్టు చేసి విచారణ సాగిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఏడుగురు వద్దనుండి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

 గతంలోనూ ఫేక్ వెహికల్ ఇన్సూరెన్స్ ల గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు

గతంలోనూ ఫేక్ వెహికల్ ఇన్సూరెన్స్ ల గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు


ఇక ఈ కేసులో పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. గతంలోనూ ఇదే తరహాలో నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను తయారు చేసే ముఠాను పట్టుకున్న పోలీసులు, మళ్లీ తిరిగి అదే తరహాలో జరుగుతున్న దందా గుట్టు రట్టు చేశారు. దీంతో వరంగల్ రవాణా శాఖ కార్యాలయం పరిసరాల్లో ఈ నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ ల వ్యవహారంపై చర్చ జరుగుతుంది.

English summary
Warangal Task Force Police raided a fake vehicle insurance racket. Seven suspects have been arrested. Many documents were seized from them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X