కామెంట్స్ చేస్తే అగ్గిరవ్వనవుతా - గవర్నర్ తమిళిసై వార్నింగ్..!!
ఎవరైనా నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తే అగ్గిలా మారి వణికిస్తానంటూ గవర్నర్ తమిళిసై హెచ్చరించారు.
గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. వార్నింగ్ ఇచ్చారు. చెన్నైలోని ఒక బాలికట ప్రయివేటు పాఠశాల వార్షికోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిధిగా హజరై ప్రసంగించారు. తన శరీర రంగు గురించి కొందరు అదే పనిగా వ్యాఖ్యలు చేస్తున్నాంటూ గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తన రంగు..ఎత్తు గురించి పదే పదే విమర్శలు చేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఎవరైనా నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తే అగ్గిలా మారి వణికిస్తానంటూ తీవ్ర ఆగ్రహంతో హెచ్చరించారు.
తన పైన అడ్డగోలుగా కామెంట్స్ చేస్తే తాను చూస్తూ ఉండనని తేల్చి చెప్పారు. తన పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తే తాను నిప్పుకణంగా మారుతానని హెచ్చరించారు. తనను విమర్శించేవారు సైతం ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరతానని వ్యాఖ్యానించారు. తనపై విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశారు. తన రంగు నలుపు, నుదురు బట్టతలలా ఉంటుందని కొందరు హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాగె కామెంట్స్ చేస్తే అగ్గిలా మారతానని ఆగ్రహం వ్యక్తం చేసారు. గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కొద్ది కాలంగా తెలంగాణ ప్రభుత్వం వర్సస గవర్నర్ అన్నట్లుగా సాగిన వివాదానికి ముగింపు లభించింది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం ఉపన్యాసానికి గవర్నర్ ను ఆహ్వానించటం.. గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం యథాతధంగా చదవటం..ప్రభుత్వం గతంలోలాగానే స్వాగతం పలకటంతో వాదం ముగిసినట్లుగానే భావిస్తున్నారు. గవర్నర్ మార్పు ఉంటుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి వారు వ్యాఖ్యానించారు. తాజాగా 12 రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు జరిగాయి. ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. తెలంగాణ గవర్నర్ విషయంలో ఎలాంటి మార్పు జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం పైన గతంలో పలు మార్లు గవర్నర్ కేంద్రానికి నివేదికలు ఇచ్చిన అంశాన్ని స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు చెన్నై కేంద్రంగా ఇప్పుడు గవర్నర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications