రేవంత్ Vs కేసీఆర్, ట్రాప్ లో చిక్కిందెవరు - ఇక సమరమే..!!
తెలంగాణ రాజకీయంలో కీలక మలుపు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు నెలల్లోనే రాష్ట్ర రాజకీయం మరోసారి ఆసక్తి కరంగా మారుతోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికల వేళ పట్టు పెంచుకొనేందుకు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు అసెంబ్లీ సమావేశాలు..బహిరంగ సభలను వేదికగా మలచుకుంటున్నారు.
కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ : తెలంగాణలో కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగించాలనే నిర్ణయం రాజకీయంగా కొత్త వివాదానికి కారణమైంది. దీని పైన కేసీఆర్ తన మార్క్ రాజకీయం ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ అంశం పై తెలంగాణకు రేవంత్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. దీని ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో కేడర్ లో జోష్ తేవటం తో పాటుగా ప్రజల్లో కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెంచటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇటు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగింత నిర్ణయం పైన చర్చకు రావాలని సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ చేసారు.

అసెంబ్లీ వేదికగా : సభలోనే అన్ని అంశాలు చర్చించటానికి సిద్దమని హరీష్ ప్రకటించారు. ఇటు కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ను లేకుండా చేస్తామన్న సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతల ప్రకటనలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'నన్ను, నా పార్టీని టచ్ చేయడం నీ (సీఎం రేవంత్) వల్ల కాదు. నీకన్నా హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర తమకు ఉందన్నారు. ఎంతో మందిని చూసామని చెప్పుకొచ్చారు. పెద్దపెద్ద వాళ్లే ఏమీ చేయలేక పోయారని స్పష్టంచేశారు. కేఆర్‌ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులు వెళితే రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. డ్యాములకు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదని, సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం తప్పదని హెచ్చరించారు.

కలిసొచ్చేదెవరికి : అటు రేవంత్ 60 ఏళ్లలో జరగని అన్యాయం.. తెలంగాణకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. కేసీఆర్ ఇంట్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో తయారైందని ఆరోపించారు. ప్రాజెక్టుల అప్పగింతకు, 299 టీఎంసీల వాటాకు కేసీఆర్ అంగీకరించారని.. వీటిపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని సవాల్ విసిరారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటివి కడుతుంటే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. చర్చకు తాము సిద్ధమని.. కాంగ్రెస్ బండారం అసెంబ్లీలోనే బయటపెడతామని హరీష్ స్పష్టం చేసారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు సవాళ్ల వేళ అసెంబ్లీ సమావేశాలు..ఈ నెల 13న నల్గొండ వేదికగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా రాష్ట్రంలో రాజకీయం కొత్త మలుపు తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications