డిసెంబర్‌లోనే ఎన్నికలు, కాంగ్రెస్‌దే విజయం: ఉత్తమ్
హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ మాసంలో ఎన్నికలు వస్తాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల రెండో విడత బస్సు యాత్రను ఆదివారం నాడు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఏప్రిల్ 10వ తేది వరకు రెండో విడత బస్సు యాత్ర తెలంగాణ జిల్లాల్లో కొనసాగనుంది.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఈ యాత్రలో తాము ప్రజలకు వివరించనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలు, స్పీకర్, ముఖ్యమంత్రి ఏ రకంగా వ్యవహరించారనే విషయమై ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు విషయమై కోర్టుకు అసెంబ్లీ సీసీ పుటేజీ దృశ్యాలు ఇవ్వలేకనే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు కాగ్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంపై తాము కోర్టుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.
నిర్ణీత సమయానికి కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications