కాసేపట్లో నిన్ను చంపేస్తాం.. మళ్ళీ ఎంపీ రఘునందన్ కు బెదిరింపు కాల్స్!

బిజెపి ఎంపీ రఘునందన్ రావు కు మరోమారు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్ ఆపాలని, లేదంటే మరికాసేపట్లో ఎంపీ రఘునందన్ రావుని చంపేస్తామని ఆయనను బెదిరిస్తూ వేర్వేరు ఫోన్ నెంబర్ల నుండి కొందరు వ్యక్తులు ఫోన్ చేశారు. ఇప్పటికే రెండురోజుల క్రితం ఆయనకు మధ్యప్రదేశ్ నుండి తాను ఒక మావోయిస్ట్ నంటూ ఒక వ్యక్తి కాల్ చేశారు.సాయంత్రం లోగా నిన్ను లేపేస్తాం దమ్ముంటే కాపాడుకోండి అంటూ సవాల్ విసిరారు.

ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు.. హైదరాబాద్లోనే ఉన్నాం
ఇక తాజాగా మరోమారు ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయని వారు తెలిపారు. తమ బృందాలు హైదరాబాద్లో మకాం వేశాయని, మరి మరికాసేపట్లో ఎంపీ రఘునందన్ రావు చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దమ్ముంటే కాపాడుకోవాలని సూచించారు. తమ ఫోన్లు ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కానీ తమ సమాచారం దొరకదని చెప్పారు.

We will kill you soon Threatening calls to BJP MP Raghunandan rao again

Take a Poll

రఘునందన్ రావును చంపేస్తామని వార్నింగ్
తాము ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రఘునందన్ రావు ని వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. బిజెపి ఎంపీ రఘునందన్ రావుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కాలికి సర్జరీ కాగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఎంపీ రఘునందన్ రావును హతమారుస్తామని జూన్ 23వ తేదీన తొలిసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ
దీంతో ఆయన డిజిపి, మెదక్, సంగారెడ్డి ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. బెదిరింపుల నేపథ్యంలో ఎంపీ రఘునందన్ రావు కు ప్రభుత్వం ఎస్కార్ట్ వాహనంతో పాటుగా అదనపు సిబ్బందితో రక్షణ కల్పించింది. ఈ క్రమంలో మళ్లీ నేడు ఆయనకు బెదిరింపు కాల్స్ రాగా, దీంతో రఘునందన్ రావు మరోమారు ఆసుపత్రి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ వ్యవహారం పైన దృష్టి సారించాలని తనకు పదేపదే కాల్ చేసి బెదిరిస్తున్న టువంటి వ్యక్తులను పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+