ఆ భయంతోనే కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతున్నారు, హైదరాబాద్ ఎంపీనే టార్గెట్: బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను బీజేపీ గళ్లాపట్టి గుంజుతేనే బయటకు వచ్చాడని అన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్‌కు ఇంటిపోరు ఎక్కువైందన్నారు బండి సంజయ్. ఆదివారం చంపాపేటలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశంలో సంజయ్ మాట్లాడారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం: బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ అన్నారు. జైలుకు వెళ్తాననే భయంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దారుసలాంను ఆక్రమిస్తామన్నారు.

తెలంగాణ ఐకాన్‌గా భాగ్యలక్ష్మి దేవాలయం: బండి సంజయ్
భాగ్యలక్ష్మి దేవాలయాన్ని తెలంగాణ ఐకాన్‌గా పునర్నిస్తామని అన్నారు. పాతబస్తీలో గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి కేసీఆర్, అసదుద్దీన్‌లు ఎందుకు హాజరుకావటం లేదు. ముస్లిం, క్రిస్టియన్ పండుగలకు సోదరసోదరీమణులంటూ ఫ్లెక్సీలు కడతారు. హిందువుల పండుగలకు మాత్రం హిందుబంధువులు, సోదరసోదరీమణులంటూ శుభాకాంక్షలు చెప్పే ధైర్యం టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు బండి సంజయ్.

హైదరాబాద్ పార్లమెంట్ గెలుపే మా టార్గెట్: బండి సంజయ్
హైదరాబాద్ పార్లమెంట్‌ను గెలవటమే బీజేపీ లక్ష్యమన్నారు బండి సంజయ్. తెలంగాణ కాషాయ అడ్డ అన్నారాయన. అవకాశం ఇస్తే.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామన్నారు. పాతబస్తీలో హిందువుల ఘర్ వాపసీ కార్యక్రమం మెదలు పెడతామన్నారు. భాగ్యనగరానికి ఐకాన్‌గా భాగ్యలక్ష్మీ దేవాలయం నిలిచిందన్నారు. పాతబస్తీ హిందువులకు అడ్డా.. ఎంఐఎం ఆగడాలను భరించలేక చాలా మంది బయటకు వెళ్ళిపోయారన్నారు. హైద్రాబాద్ పార్లమెంట్‌ను బీజేపీ ఎందుకు గెలవదో చూద్దామన్నారు. ఎంఐఎం గూండాల నుంచి తెలంగాణను విముక్తి కల్పిస్తామన్నారు బండి సంజయ్.

యూనిఫాంతో పాఠశాలకు రావాలంటే తప్పేముంది: బండి సంజయ్
హిజాబ్ వివాదంపైనా స్పందించారు బండి సంజయ్. యూనిఫాంతో మాత్రమే పాఠశాలకు రావాలనటంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ముస్లీం ఆడ బిడ్డల జీవితాన్ని ఆగం చేస్తున్న ట్రిపుల్ తలాఖ్‌ను మోడీ సర్కార్ రద్దు చేసిందని గుర్తు చేశారు. తలాఖ్ తలాఖ్ అనే మూడనమ్మకాన్ని మోడీ పక్కకు పెట్టారన్నారు. ట్రిపుల్ తలాఖ్‌ను మోడీ రద్దు చేసినందుకు ఉత్తర ప్రదేశ్‌లో ముస్లిం ఆడ బిడ్డలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ముస్లిం మహిళలు ఓటు హక్కు ఉపయోగించుకాకుండా ఫత్వా జారీ చేసేందుకు ఎంఐఎం సిద్దమైందని బండి సంజయ్ అన్నారు. ఎంఐఎం ఆగడాలపై ముస్లిం సమాజం ఆలోచించాలని సూచించారు.












Click it and Unblock the Notifications