బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ చేసిన ప్రసంగంపై రెండు రోజులుగా సాగిన చర్చకు శాసనమండలి, శాసనసభల్లో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలను వారి సీనియారిటీ ప్రకారం ఏడాదిలోగా వంద శాతం చెల్లిస్తామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన అంశాల ప్రాధాన్యతతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అందుకు ప్రజా ప్రతినిధులతో పాటు ఉద్యోగులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వచ్చే సహేతుకమైన సలహాలను తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు.

We will try to bring BC sub-plan CM Revanth Reddy

వాస్తవాలను వివరిస్తూ పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వం జవాబుదారిగా పనిచేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. "గడిచిన 15 నెలలుగా ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల ప్రాతిపదికగానే ఆయా అంశాలను గవర్నర్ ప్రసంగంలో చేర్చాం. గవర్నర్ ప్రసంగంపై సభలో వచ్చే సూచనలు, సలహాలను బడ్జెట్‌లో ప్రతిబింబించే ప్రయత్నం చేస్తాం. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడుపదలుచుకోలేదు. ప్రజలకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా, పెట్టుబడులను తెచ్చి, వీలైనంత మేరకు సంక్షేమం, అభివృద్ధి చేస్తూ, పారదర్శక పరిపాలనను తీసుకురావాలన్న తాపత్రయంతో ఆలోచనలు చేస్తున్నాం. రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయ వివరాలను తెలియజేస్తూ, ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తూ పనిచేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు.

ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎంత చిత్తశుద్ధితో చేశామన్నది చెప్పారు. బీసీ కులగణన అవసరం, ఆవశ్యకత, జరిగిన తీరును సమగ్రంగా వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఒక ప్రాతిపదిక కావాలని, అందుకోసం చిత్తశుద్ధితో కులగణన చేశామని వివరించారు. బీసీ సబ్‌ ప్లాన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం రేవంత్.

రైతాంగానికి అండగా..

తెలంగాణలో వ్యవసాయ కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతోనే రైతులను రుణ విముక్తులను చేయాలని రెండు లక్షల రుణ మాఫీ చేశాం. అలాగే, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పంట కొనుగోలు, సన్నవడ్లకు బోనస్, రైతాంగ సమస్యల పరిష్కారానికి రైతు కమిషన్ ఏర్పాటు వంటి రైతులకు తోడ్పాటును అందించే కార్యక్రమాలను సోదాహరణగా వివరించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేసిన చర్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్.

విభజన తర్వాత రాష్ట్ర నీటి వాటా సాధనకు ఎలాంటి ప్రయత్నాలు చేసిందీ వివరించారు. తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటా కోసం చేస్తున్న ప్రయత్నాలు, పోరాటాలను తెలిపారు. గత పదేళ్ల కాలంలో నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ వాటా దక్కించుకోవడంలో ఎలా విఫలమైందీ ప్రాజెక్టుల వారిగా ముఖ్యమంత్రి వివరించారు.

మహిళల సాధికారత కోసం చేపట్టిన పనుల ఒక్కొక్కటిగా సమగ్రంగా వివరించారు. అలాగే గత పదేండ్లలో విద్యా రంగ పరిస్థితులను విడమరుస్తూ, విద్యా రంగ అభివృద్ధికి 15 నెలలుగా ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సభముందు ఆవిష్కరించారు. పదేళ్లుగా నిర్వీర్యం చేసిన యూనివర్సిటీలను తిరిగి జీవం పోయడానికి చేసిన ప్రయత్నాలను సీఎం చెప్పారు.

విద్య కోసం..

విద్యార్థుల్లో నైపుణ్యం కొరవడి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించని పరిస్థితులను అధ్యయనం చేసి సాంకేతిక నైపుణ్యం పెంచాలన్న ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన, క్రీడాభివృద్ధికి ప్రత్యేకంగా యూనివర్సిటీ స్థాపన, క్రీడాభివృద్ధికి ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలతో ఒప్పందాలు, దశాబ్దాలుగా మూస పద్ధతిలో నడుస్తున్న ఐటీఐలను ఆధునిక సాంకేతికత జోడించి ఏటీసీలుగా మార్చుతున్న విధానాలను సీఎం రేవంత్ తెలియజేశారు.

ఉద్యోగ నియామకాలు..

ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజారిందని చెబుతూ దాని ప్రతిష్టను కాపాడటానికి తీసుకున్న చర్యలను తెలియజేశారు. పేపర్ లీకేజీలతో అప్రతిష్టపాలైన పరిస్థితి నుంచి ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ పోటీ పరీక్షలను నిర్వహిస్తూ, ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో 57 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రానికి లేదన్నారు. తెలంగాణ నిరుద్యోగ రేటు కూడా తగ్గిందని గణాంకాలు వివరించారు.

విద్యా రంగాన్ని పట్టించుకోని కారణంగా గత పదేండ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గిపోయిందని, ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి డీఎస్సీ నిర్వహించి 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడం, పదోన్నతులు కల్పించడం, బదిలీల ప్రక్రియ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలలను మెరుగుపరచడానికి అవసరమైతే చట్ట సభల్లో ప్రత్యేకంగా చర్చ చేసి అవసరమైన చర్యలను తీసుకుందామని సీఎం రేవంత్ అన్నారు.

ప్రధానితో సత్సంబంధాలు అందుకే..

రాష్ట్రం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తుందని, దేశ ప్రధానమంత్రితో సహా ఢిల్లీ వెళ్లి అనేక మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు, నిధుల గురించి అడిగిన వివరాలను సభ ముందు పెట్టారు. ఏఏ మంత్రులను కలిసిందీ ఏ ఏ ప్రాజెక్టుల కోసం సహకరించాలని కోరిందీ విడమరిచారు.

హైదరాబాద్ చారిత్రాత్మక లాల్ దర్వాజ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి 20 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలే ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన విషయాన్ని చెప్పారు. వరంగల్‌కు విమానాశ్రయం సాధించినట్టుగానే ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్ విమానాశ్రయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు సీఎం రేవంత్.

బీఆర్ఎస్‌పై రేవంత్ విమర్శలు

2022 లో ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారని, 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా అలాంటి ప్రయత్నం జరగ్గా, న్యాయస్థానం జోక్యంతో విధిలేని పరిస్థితిలో గవర్నర్ గారి ప్రసంగానికి అప్పటి ప్రభుత్వం అనుమతినిచ్చిదని గుర్తుచేస్తూ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కాదన్నారు సీఎం రేవంత్.

రాజ్యాంగ సంస్థలైన కేంద్రం, గవర్నర్, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ... రాష్ట్రాలు అన్నింటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుని వ్యవస్థలను గౌరవించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామిక సంప్రదాయాలకు కట్టుబడి తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చిన సభ్యులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+