అలర్ట్: మరో నాలుగు రోజులపాటు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా, మరో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయ్యాయి.
కాగా, రాగల రెండు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాలతో పాటు మరిన్ని ఏరియాల్లో 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై, సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరముంటేనే బయటకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

హైదరాబాద్‌లో సోమవారం రాత్రి బీభత్సం సృష్టించిన భారీ వర్షం
హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ప్రాంతాలు అంధకారంలోని ఉన్నాయి.
హైదరాబాద్
నగర
వ్యాప్తంగా
సోమవారం
రాత్రి
కుండపోత
వర్షం
కురిసింది.
ఉప్పల్,
తర్నాక,
సికింద్రాబాద్,
బేగంపేట్,
బంజారాహిల్స్,
జూబ్లీహిల్స్,
ఖైరతాబాద్,
సోమాజిగూడ,
పంజాగుట్ట,
అమీర్‌పేట,
లక్డీకపూల్,
మూసాపేట,
ఎర్రగడ్డ,
పటాన్
చెరు,
ఆర్సీపురం,
మణికొండ,
కొండాపూర్
తదితర
ప్రాంతాల్లో
సోమవారం
రాత్రి
భారీ
వర్షం
కురిసింది.
అత్యధికంగా
మాదాపూర్‌లో
67.3
మిల్లిమీటర్ల
వర్షపాతం
నమోదైంది.
దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలోనే ఉండిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో నగరవాసులు అనవసరంగా బయటికి రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అంతేగాక, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఏదైనా అత్యవసరమైతే 040-21 111 111 ఈ నెంబర్ కు ఫోన్ చేయాలని కోరింది. సంగారెడ్డి జిల్లాల్లోనూ సోమవారం రాత్రి వర్షం దంచికొట్టింది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలోనూ భారీ వర్షం పడింది. తెలంగాణలో ఇతర జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.