Weather update: తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు, రైతుల ఆనందం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉప‌రి‌తల ఆవ‌ర్తనం, ఉప‌రి‌తల ద్రోణి ప్రభా‌వంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం పెద్దపల్లి, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరం‌గల్‌, కరీంన‌గర్‌, సూర్యా‌పేట, మహ‌బూ‌బా‌బాద్‌, హన్మకొండ జిల్లాల్లో, 17, 18న పలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని చెప్పింది.

బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

 Weather update: three more days heavy rains in telangana state.

సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. జగిత్యాల, కరీంనగర్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. సోమవారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో 12.9 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లా పుట్టపహాడ్‌లో 11.5 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా దూల్‌మిట్టాలో 10.7 సెం.మీ, జనగామ జిల్లా బచ్చన్నపేటలో 9.9 సెం.మీ, మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్‌లో 9.2 సెం.మీ, కరీంనగర్‌ జిల్లా నుస్తులాపూర్‌లో 8.6 సెం.మీ, భద్రాద్రి జిల్లా పెంట్లంలో 8 సెం.మీ వాన పడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu

    ఇక ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెంట్లం(భద్రాద్రి జిల్లా)లో 6.5, పెదవీడు(సూర్యాపేట)లో 3.3, పమ్మి(ఖమ్మం)లో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదముందని ఆందోలన చెందిన రైతులు.. వాతావరణం చల్లబడి వర్షాలు కురవడంతో పంటలకు కొంత మేలు జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+