హైదరాబాద్ తోపాటు నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు, మరో రెండ్రోజులు: ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్: నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొద్ది రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాలను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో, దేశంలోని పలు ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్ తోపాటు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్


ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం, ఆదివారం ఆదిలాబాద్, కోమరంభీం అసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలంటూ భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. ఇక హైదరాబాద్ సహా మిగతా 26 జిల్లాలకు వాతారవణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చింది.

హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం..


శనివారం హైదరాబాద్ మహా నగరాన్ని మరోసారి కుండపోత వర్షం ముంచెత్తింది. చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి వర్షం పడుతూనే ఉంది. చాలా చోట్ల వర్షపు నీటితో రోడ్లన్నీ మునిగిపోయాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్‌షుఖ్‌ నగర్.. సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో వాన దండికొడుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు జలమయం

రాజేంద్రనగర్‌లోని కాలనీల్లో భారీ ఎత్తున వరదనీరు ప్రవహిస్తున్నాయి. నాళాలు ఉప్పొంగుతున్నాయి. అంబర్‌పేట్‌, రాజేంద్రనగర్‌, ఎల్బీ నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్తాపూర్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. కాటేదాన్‌, శివరాంపల్లి, బండ్లగూడలోనూ వర్షం పడుతోంది. మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. భారీ వర్షానికి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద .. మోకాళ్ల లోతు నీళ్లు పారుతున్నాయి. అంబర్ పేటలోనూ భారీ వర్షం కురిసింది. కాలనీలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎల్బీనగర్‌‌లో చెరువులను తలపించేలా నీళ్లు రోడ్డుపై ప్రయాణిస్తున్నాయి. వరద నీటిలో బైక్‌లు కొట్టుకుని పోతున్నాయి. కార్లు, బస్సులు కూడా వెళ్లలేని పరిస్థితి ఎల్బీనగర్‌లో ఉంది. రామంతపూర్‌లో ప్రమాదం తప్పింది. రోడ్డుపై గుంతను తవ్వి వదిలేశారు సిబ్బంది. ఆ గుంతలోనే బైక్‌తో సహా పడిపోయారు ఓ యువకుడు. వెంటనే పైకి లేచి ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఏపీలోనూ కొనసాగుతున్న భారీ వర్షాలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం వరకూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+