ఎన్నిక‌ల వేళ బిజిగా మారిన సిరిసిల్ల నేత‌న్న‌లు...

ఏ పార్టీకైనా త‌మ ఎజెండాతో పాటు పార్టీ జెండా కూడా ఎంతో ముఖ్యం. ఇవి ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఎంతో బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఎందుకంటే ఎన్నిక‌ల్లో కీల‌క‌పాత్ర పోషించేది ప్రచార‌మే. ఆ ప్ర‌చార‌మే గెలుపు ఓట‌ములను డిసైడ్ చేస్తుంది కూడా. అటువంటి సంద‌ర్భాల్లో ప్ర‌చారాల‌ను మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా మార్చాలంటే అందులో పార్టీ జెండాలు ఉండాల్సిందే.. ఈ మ‌ధ్యే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌యింది.

పార్టీల ప్ర‌చారాల‌ను మ‌రింత వేగ‌వంతం చేసేందుకు దేశంలోని పార్టీల‌న్నీ తెలంగాణ‌లోని సిరిసిల్ల‌కు బ‌యలుదేరుతున్నాయి. ఎందుకంటే సిరిసిల్ల‌లో నేత‌న్న‌లు త‌యారు చేసే జెండాల‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ప్ర‌చారం ముందుకు సాగాలంటే పార్టీ జెండాలు, కండువాలు, బ్యాన‌ర్లు ఎంతో అవ‌స‌రం. కాబ‌ట్టి పార్టీ నాయ‌కులంతా ఇప్పుడు సిరిసిల్ల నేత‌న్న‌ల ద‌గ్గ‌రికి వెళుతున్నారు. అందుకే, ఈ ఎన్నికల వేళ బిజి బిజిగా మారిపోయారు సిరిసిల్ల నేత‌న్న‌లు...

Weavers from Siricilla becomes very busy amid the election, Here is why

చేనేత‌ల చేతినిండా పని : ఒకేసారి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్ర‌క‌టించ‌డంతో సిరిసిల్ల నేతన్నలు తయారు చేసే జెండాలకు డిమాండ్ బాగా పెరిగింది. కేవ‌లం తెలంగాణ నుంచే కాదు. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌ నుంచి కూడా చేనేతలకు ఆర్డర్లు వ‌చ్చేస్తున్నాయి. ఇంత‌కుముందు ఈ నేత‌న్న‌లు బ‌తుకు ఎంతో ద‌య‌నీయంగా ఉండేది. తవ వార‌సత్వ వృత్తిని కాపాడుకునే స‌మయంలో వీరికి ఎన్నో ఆటంకాలు ఎదుర‌య్యాయి. అయినా వీరు చింతంచ‌లేదు. ఎప్పుడో జెండా పండుగ‌ల‌ప్పుడే వీరికి పని ల‌భిస్తుంది. వాటి కోసం ప్ర‌తి ఏటా ఎదురుచూడడం ప‌రిపాటిగా మారింది. అయితే, ఈసారి వ‌చ్చిన ఎన్నిక‌లు ఈ నేత‌న్న‌ల‌కు పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చాయి. ఎందుకంటే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు రావడంతో వీరు ఇప్ప‌డు బిజీబిజీ అయిపోయారు.

ప్రచారంలో ఉపయోగించే జెండాలు, కండువాలు, బ్యానర్ల తయారీలో నేతన్నలు, వారి కుటుంబసభ్యులు మునిగిపోయారు. చేనేత‌ల చేతినిండా పని దొర‌క‌డంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లువెత్తింది. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీల ప్రచార సామాగ్రి కోసం సిరిసిల్లకే ఆర్డర్లు వ‌చ్చాయి. ఇంకా తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పార్టీ నుంచి సిరిసిల్ల నేతన్నలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు రావ‌డంతో సిరిసిల్ల నేతన్న‌ల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోతుంది.

Weavers from Siricilla becomes very busy amid the election, Here is why

జెండాలు, బ్యాన‌ర్ల ధ‌ర‌లు : సిరిసిల్లలోనే తయారైన పాలిస్టర్‌ బట్టను హైదరాబాద్‌లో ఆయా పార్టీల గుర్తులతో జెండాలు, బ్యానర్లు, కండువాలు ప్రింటింగ్‌ చేసి, సిరిసిల్లలో కటింగ్‌, కుట్టు పనులను చేస్తూ ఉంటారు. జెండాలు కుట్టే మ‌హిళ‌ల‌కు నెలకు నాలుగువేల రూపాయ‌ల నుంచి ఐదు వేల రూపాయ‌ల దాకా ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఇక్కడ తయారయ్యే జెండాలు వివిధ సైజుల్లో లభిస్తాయి. కండువాల ధరలు ఐదు రూపాయ‌ల నుంచి యాభై రూపాయ‌ల దాకా ఉంటాయి. చిన్న చిన్న జెండాలు ప‌ది రూపాయ‌ల ఉండ‌గా, పెద్ద బ్యాన‌ర్లు ఎనభై రూపాయ‌ల‌కు త‌యారుచేస్తారు.

ఇక డిజిటల్‌ బ్యానర్ల‌యితే పెద్దవి రూ. 250కి అమ్ముతారు. ఇక ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు వ‌చ్చే నాలుగైదు మాసాల్లో లోక‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిసా, అరుణాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గ‌రా మోగ‌నుంది. ఇక ఆ రాష్ర్టాల్లోని ఆయా పార్టీల నుంచి ఆర్డ‌ర్లు వ‌స్తాయి. ముఖ్యంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన తదితర పార్టీల ప్రచార సామగ్రి కూడా ఎప్ప‌డూ ఇక్క‌డే తయారవుతోందని స‌మాచారం. సిరిసిల్లలో 35 ఏళ్లుగా కాటన్‌, పాలిస్టర్‌ వస్త్రాలపై పార్టీల నినాదాలతో పాటు, ప్రచారపు జెండాలు, బ్యానర్లు తయారు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+