రచ్చ రేపుతోన్న రేవంత్ రెడ్డి నియామకం: కేసీఆర్ విధేయులే టార్గెట్: వెల్‌కమ్ టు మధురై కోర్ట్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగట్లేదు. పైగా మరింత రాజుకుంటోంది. రోజులు గడిచే కొద్దీ దాని తీవ్రత పెరుగుతోందే తప్ప చల్లారట్లేదు. రేవంత్ రెడ్డి నియామకం వ్యవహారంలో కాంగ్రెస్ పెద్ద తలకాయలకు భారీగా ముడుపులు ముట్టాయంటూ వస్తోన్న ఆరోపణలు, విమర్శలు.. తెలంగాణలో రాజకీయ దుమారానికి దారి తీస్తోన్నాయి. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చుతున్నారు. పరువు నష్టం దావా వేయడానికి సిద్ధపడుతోన్నారు. ఈ వ్యవహారం మొత్తం ఇప్పట్లో తెగేలా కనిపించట్లేదు.

50 కోట్ల రూపాయల ఆరోపణలు..
కాంగ్రెస్‌కు తాజాగా గుడ్‌బై చెప్పిన యువ నాయకుడు కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు మరింత రచ్చ చేస్తోన్నాయి. తనకు పీసీసీ అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టాలంటూ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు 50 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ.. వారందరినీ కాదని రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలను అప్పగించడానికే ఈ ముడుపులే కారణమని విమర్శించారు. తనకు హుజూరాబాద్ టికెట్ ఖాయమైందంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో లీక్ అయిన తరువాత ఆయన పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపైనా
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడానికి మాణిక్కం ఠాగూర్ 25 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారంటూ ఇదివరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి నుంచి 25 కోట్ల రూపాయలను తీసుకుని.. రేవంత్‌ను తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ను చేశారంటూ సుధీర్ రెడ్డి విమర్శించారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఓ అడుగు ముందుకేశారు. రేవంత్ రెడ్డి విషయంలో వస్తోన్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవట్లేదు. ఆ ఆరోపణలకు కౌంటర్ అటాక్‌కు సిద్ధపడింది. లీగల్‌గానూ తేల్చుకోవడానికి సమాయాత్తమౌతోంది.

వెల్‌కమ్ టు మధురై కోర్టు
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై మాణిక్కం ఠాగూర్ స్పందించారు. వారిద్దరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ విధేయులుగా పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, వాటికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పరువు నష్టం దావా వేయనున్నట్లు చెప్పారు. తన న్యాయవాది నుంచి లీగల్ నోటీసులను అందుకోవడానికి కేసీఆర్ విధేయులు సిద్ధంగా ఉండాలని సూచించారు. మధురై కోర్టుకు సుస్వాగతం అంటూ.. వారికి చురకలు అంటించారు. తన న్యాయవాది లీగల్ నోటీసులను సిద్ధం చేస్తోన్నారని, వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
In #Telangana politics after a sensational audio clip virals #kaushikreddy MLA candidate from #Huzurabad #resigns accuses @manickamtagore of taking Rs 50 crore bribe from @revanth_anumula to become PCC chief. pic.twitter.com/3JMM12zv2u
— Sriram Karri (@oratorgreat) July 12, 2021












Click it and Unblock the Notifications