ఆ మర్మం ఏందో..? స్మితా సబర్వాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్!
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal)కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన క్రమంలో ఆమెకు ఏప్రిల్ 12న పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్మిత ఎక్స్ వేదికగా స్పందించారు.
పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు స్మిత సబర్వాల్ తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. తాను రీపోస్టు చేసినట్లే రెండు వేల మంది చేసినట్లు చెప్పారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అని స్మితా సబర్వాల్ నిలదీశారు.

కంచగచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫొటోను ఆమె సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు ఆమె విచారణకు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు స్పందించారు.
#Ghibli Story On #Hyderabad Today! #SaveHCU #SaveHCUBioDiversity#SaveHyderabadBioDiversity 🏞️ pic.twitter.com/ozbmxvSZ7D
— Hi Hyderabad (@HiHyderabad) March 31, 2025
ఈ నేపథ్యంలోనే స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై సీఎం సీపీఆర్వో అయోధ్య రెడ్డి బోరెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. 'ఆ ఐఏఎస్ అధికారి 'దృష్టికోణం'లో మార్పు ఎందుకొచ్చినట్లు? అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా?' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
'అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (CMOలో Irrigation బాధ్యతలు నిర్వహించిన) వీరే. . ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో. .?? అసలు ఏడుపు వన్య ప్రాణుల కోసమా..?? అధికారం కోల్పోయిన వారి కోసమా. .?? ఇవీ కొన్ని ఉదాహరణలు అంటూ సీఎం సీపీఆర్వో ఘాటుగా స్పందించారు.
ఆ IAS అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు. .??
— Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) April 19, 2025
అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా. .??
అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (CMO లో Irrigation బాధ్యతలు నిర్వహించిన) వీరే. . ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో. .??
అసలు… pic.twitter.com/0KnHYAVeg5
అంతకుముందు పోలీసులు నోటీసులు ఇవ్వడంపైనా స్మితా సబర్వాల్ స్పందించారు. తనకు మద్దతుగా నిలిచినవారి ట్వీట్లను కూడా ఆమె రీట్వీట్ చేశారు. 'మొదటిసారిగా, పోలీసులు రీట్వీట్ చేసినందుకు ఒక ఐఏఎస్ అధికారిపై కేసు నమోదు చేశారు!. స్మితా సభర్వాల్, ఐఏఎస్, యువజనాభివృద్ధి, పర్యాటక & సంస్కృతి ప్రధాన కార్యదర్శికి తెలంగాణ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. నేరం: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని బుద్ధిహీనంగా బుల్డోజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె AI- రూపొందించిన గిబ్లి చిత్రాన్ని రీట్వీట్ చేశారు. ఈరోజు బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 179 కింద గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న 100 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని బుల్డోజ్ చేయడంపై సుప్రీంకోర్టు ఈరోజు కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది' అని ఓ జర్నలిస్టు చేసిన పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications