ఏపీలో చంద్రబాబు ఏం చేసినా ఎఫెక్ట్ రేవంత్ రెడ్డికే.. ఎలాగంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు పాలన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి తలనొప్పిగా తయారవుతుందా? తెలంగాణ ప్రజలు పక్క రాష్ట్రంలోని పాలన చూసి రేవంత్ రెడ్డి పాలనలో హామీలు అమలు కావడంలేదని టార్గెట్ చేసే అవకాశం ఉందా? ఓ పక్క రేవంత్ రెడ్డికి గురువుగా భావించే చంద్రబాబు దూకుడుగా ముందుకు వెళుతుంటే, రేవంత్ రెడ్డి చంద్రబాబుకు దీటుగా దూకుడు చూపించలేకపోతున్నారా? అన్నది ఏపీ, తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
ఏపీని ఆసక్తిగా గమనిస్తున్న తెలంగాణా
టిడిపి అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో విజయం సాధించి టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పాలనలో తన మార్కు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తిచేసి ఏపీ రైతాంగానికి సాగునీరు అందించాలని చంద్రబాబు ప్రణాళిక ప్రస్తుతం తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా ఆసక్తిగా గమనిస్తోంది.

తెలంగాణా యువత దృష్టిని ఆకర్షిస్తున్న చంద్రబాబు నిర్ణయం
అంతే కాదు చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన తొలినాడే ఐదు కీలక ఫైళ్ళ పైన సంతకాలు చేశారు. ఒకటి ఏపీలో మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చంద్రబాబు సంతకం చేయగా, స్కిల్ సెన్సెస్ కూడా చేపట్టనున్నట్టు చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిని ముఖ్యంగా తెలంగాణ యువత దృష్టిని ఆకర్షిస్తుంది.
జాబ్ క్యాలెండర్ కోసం యువత డిమాండ్
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు లేవని లబోదిబోమన్న నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసి, రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు ఆ ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే తెలంగాణాలోని యువత ఉద్యోగాల కోసం త్వరలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేస్తుంది.
ఉద్యోగాల భర్తీ ఏపీని చూసి నేర్చుకోవాలంటున్న బీఆర్ఎస్
ఇక నిరుద్యోగ యువత పక్షాన బిఆర్ఎస్ పార్టీ కూడా రెండు లక్షల ఉద్యోగాల భర్తీపైన ఫోకస్ చెయ్యాలని, 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి హామీలు గాలికి వదిలేయడాన్ని బీఆర్ఎస్ తప్పు పడుతుంది. ఏపీని చూసైనా నేర్చుకోవాలని హరీష్ రావు అంటే నేతలు చెబుతున్న మాటలను బట్టి ముందు ముందు ఏపీలో ఏది జరిగినా దాని ప్రభావం తెలంగాణలో కూడా ఉండబోతుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications