బీజేపీ కొంప ముంచుతున్న కేసీఆర్ కోవర్టులు ఎవరు? హాట్ డిబేట్!!
తెలంగాణ బిజెపిలో ప్రస్తుతం ఒక గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ బిజెపి నుండి నేతలు పార్టీ మారాలని పక్క చూపులు చూస్తున్నారు అని ఒక పక్కన ప్రచారం జరుగుతుంటే, బీజేపీలో చేరికలకు ఇతర పార్టీల నాయకులు ఆసక్తి చూపించటం లేదన్నది మరో తలనొప్పిగా మారింది.
ఇక ఇదే సమయంలో బీజేపీలో కోవర్టులు ఉన్నారని, వారు బిజెపిలో జరిగే ప్రతి విషయాన్ని సీఎం కేసీఆర్ కు ఉప్పు అందిస్తున్నారని, అసలు బిజెపి కొంప ముంచుతున్న ఘనులు అన్న ఎవరు అన్న చర్చ అన్నిటికంటే ఆసక్తికరంగా మారింది. తాజాగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. నందీశ్వర్ గౌడ్ తెలంగాణ బీజేపీ లో కెసిఆర్ కోవర్టులు ఉన్నారని తేల్చి చెప్పారు.

పార్టీలో జరుగుతున్న అంతర్గత సమావేశాలకు సంబంధించిన ప్రతి సమాచారం కెసిఆర్ కు పక్కాగా చేరుతుందని ఆయన ఆరోపించారు. కొందరు కెసిఆర్ కు నమ్మిన బంటులు గా ఉంటూ బీజేపీకి నష్టం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ లో ఉన్న కేసీఆర్ కోవర్టుల పేర్లు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లానని తన వద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
బిజెపి తెలంగాణ రాష్ట్రం వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కు కోవర్టుల పేర్లు చెప్పడం తో పాటు ఆధారాలను సమర్పించానని నందీశ్వర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే బిజెపి లో ఉన్న కోవర్టుల పేర్లు మీడియా ముఖంగా వెల్లడిస్తా అన్నారు.
ఇక దీంతో అసలు బిజెపికి నష్టం చేస్తున్న నాయకులు ఎవరు? ఎవరు కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు? బిజెపిలో ఉన్న పాత నేతలా లేదా కొత్తగా పార్టీలో చేరిన వారా? అంటూ బీజేపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలు బండి సంజయ్ కు తలనొప్పిగా తయారయ్యాయి.
ఇక ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. ఈ తరుణంలో బిజెపిలో కోవర్టులు ఉన్నారన్న వార్త పార్టీలో దావానలంగా మారింది. ఈ పరిణామం బీజేపీ అధిష్టానానికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోవాల్సిన చోట అలా కాకుండా పార్టీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు బీజేపీ అగ్ర నాయకులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications