పరకాలలో పాగా వేసేది ఎవరు..! కొండ సురేఖ ఎంట్రీతో రసవత్తరం కానున్న పోటీ..!!
హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలను ఆపథర్మ సీయం చంద్రశేఖర్ రావు ఏ ముహూర్తంలో కుదిర్చారో తెలియదు గాని రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొన్ని నియోజక వర్గాల్లో సొంతపోరు తారా స్థాయిలో నడుస్తుంటే కొన్ని నియోజక వర్గాల్లో త్రిముఖపోరు నెలకొంది. తాజాగా పరకాల నియోజక వర్గంలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకూ ఏకపక్షమనుకున్న పరకాల ఎన్నిక కొండా సురేఖ ఎంట్రీతో త్రిముఖ పోరులా మారింది.టీడిపి, టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీల మద్య ఆసక్తికర పోరు జరగబోతోంది. 2014 లో ఉంత్కంఠ పరిస్థితుల మద్య తెలుగుదేశం పార్టీ తరుపున విజయం సాదించిన చల్లా ధర్మారెడ్డి కి ఈ సారి కొండా సురేఖ రూపంలో కష్టాలు ఎదురౌతున్నాయి. సురేఖ పరాకాల నుండి పోటీ చేస్తానని చేసిన ప్రకటన తో ఒక్కసారి ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

పరాకాలలో రాజకీయ టెన్షన్..! కొండా సురేఖ ఎంట్రీతో చెలరేగిన ఉత్కంఠ..!!
రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కొండా సురేఖ పనిచేస్తున్నారని సమాచారం. కొండా దంపతుల రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయిందని కాంగ్రెస్ వర్గాలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు చల్లా వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి ఎదురైనా కుంగిపోలేదు. తెలంగాణ ఆవిర్భవించాక చాలామంది నేతలు టీఆర్ ఎస్ లోకి జంప్ అయినా ఆయన మాత్రం మారలేదు. టీడీపీలోనే కొనసాగారు. పట్టుదలతో పనిచేశారు. పార్టీ క్యాడర్ ను కాపాడుకున్నారు. ఆ పార్టీ టికెట్ పైనే పోటీ చేశారు. బలమైన సెంటిమెంట్ ను తోసిరాజని మరీ 2014 ఎన్నికల్లో గెలుపు బావుటా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎగరేశారు. ఎన్నికల అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో చల్లా టీఆర్ ఎస్ లో చేరారు.

గెలుపుపై చల్లగా ఉన్న చల్లా ధర్మారెడ్డి..! కొండా దంపతుల రాకతో అయోమయంలో గులాబీ దళం..!!
అధికార పార్టీ అందించిన అండతో తన నియోజకవర్గంలో మంచి అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజాభిమానాలను మరింతగా చూరగొన్నారు. దీంతో ఈ దఫా కూడా పరకాల నుంచి ఆయనే టీఆర్ ఎస్ తరపున బరిలో దిగుతారని ప్రజలు విశ్వసించారు. వారి నమ్మకాన్ని అధికార పార్టీ వమ్ము చేయలేదు. చల్లా విజయంపై ఎలాంటి అనుమానం లేకపోవడంతో తిరిగి టికెట్ ను ఆయనకే కేటాయించింది. పరకాలలో ఆయన్ను ఢీకొట్టే అభ్యర్థులెవరూ ప్రత్యర్థి పార్టీల్లో లేరని అంచనా వేసింది. ఇక్కడే అనూహ్య మలుపు. గత ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ లో ఉన్న కొండా దంపతులు ఇప్పుడు సొంతగూడు కాంగ్రెస్ కు చేరుకున్నారు. టీఆర్ ఎస్ పై యుద్ధం ప్రకటించారు.

సురేఖ సొంత నియోజకవర్గం పరకాలే..! సులభంగా గెలవాలే..!!
పరకాలలో తాను స్వయంగా బరిలో దిగనున్నట్లు కొండా సురేఖ తాజాగా ప్రకటన కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా పరకాలలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ ఎస్ కు ప్రతికూల పవనాలు మొదలయ్యాయి.వాస్తవానికి పరకాల టికెట్ ను కాంగ్రెస్ నుంచి ఇనగాల వెంకట్రామిరెడ్డి - అవేలి దామోదర్ ఆశించారు. వారిద్దరిలో ఎవరు పోటీ చేసినా చల్లాకు విజయం అంత కష్టం కాకపోయి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొండా రాకతో పరకాల రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి కొండా సురేఖ సొంత నియోజకవర్గం పరకాలే. గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరపున వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందినప్పటికీ, అంతకుముందు పరకాల ఎమ్మెల్యేగానే పనిచేశారు.

పరకాలలో హోరాహోరీ తప్పదు..! చల్లాకు చుక్కలే అంటున్న కొండా వర్గం..!!
నియోజకవర్గంలోని పరకాల - గీసుగొండ - ఆత్మకూరు - సంగెం మండలాల్లో కొండా కుటుంబానికి మంచి పట్టుంది. కొండా వరంగల్ తూర్పుకు వెళ్లిపోయాక వారి అనుచరగణం తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ ఎస్ లోకి వెళ్లింది. ఇప్పుడు కొండా తిరిగి రావడంతో పరిస్థితులు మారుతున్నాయి. పాత మిత్రులు - అనుచరగణం తిరిగి కొండాతో కలుస్తున్నారు. ఇక సురేఖను పరకాల నియోజకవర్గంలో చాలామంది మహిళలు తమ ఇంటి ఆడపడుచుగా చూస్తుంటారు. ఆ కోణంలోనూ చల్లాపై కొండాకు బలం ఉంది. ధనబలంలోనూ కొండాకు సాటిలేదు. కాబట్టి ఈ సారి పరకాలలో హోరాహోరీ తప్పదని, చల్లా గెలుపు అంత సులువు కాదని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications