బండ్ల గణేష్ మరో ట్విస్ట్ - యూపీలో నేరుగా సీఎం యోగీతో..!!

బండ్ల గణేష్. ఎప్పుడూ సంచలనాలతో వార్తల్లో నిలిచే వ్యక్తం. నటుడిగా.. నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్ ఇప్పుడు మరోసారి వార్తల్లో హల్ చల్ చేస్తున్నారు. ఈ సారి ఎటువంటి వ్యాఖ్యలతో కాదు.. పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలతో కాదు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ సీఎం యోగితో దిగిన ఫొటో ఆయన తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. గతంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసారు. నేరుగా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బండ్ల గణేష్ 2018 ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు.

Why did Bandla Ganesh meet UP CM Yogi Adityanath- know here

అదే సమయంలో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితం గా గెలుస్తుందటూ కొన్ని సవాళ్లు కూడా చేసారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకే కాదు.. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉన్నా... బండ్ల గణేష్ మాత్రం జనసేనలో చేరలేదు. ఇక, ఇప్పుడు యోగీతో కలిసి ఉన్న ఫొటో పోస్టు చేసిన బండ్ల గణేష్ పోస్టు ఆసక్తి కరంగా మారుతోంది. చేశాడు. యూపీ కి వరసగా రెండోసారి సీఎంగా పదవీ బాధ్యత‌లు చేప‌ట్టిన యోగి ఆదిత్యనాథ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆ ప‌రమేశ్వరుడు ఆయ‌న‌కు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాల‌ని ఆకాంక్షించారు.

Why did Bandla Ganesh meet UP CM Yogi Adityanath- know here

జనసేన - బీజేపీ మధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. కానీ, రానున్న ఎన్నికల నాటికి జనసేన - బీజేపీ పొత్తు ఎటు టర్న్ తీసుకుంటుందనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. ఇక, బండ్ల గణేష్ ఎప్పుడు యోగీతో కలిసారు.. ఏంటనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు బండ్ల ట్వీట్ చూసిన వారు మాత్రం గణేష్ రాజకీయంగా మంచి సంబంధాల కోసం ప్రయత్నాలు బాగానే చేస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+