బాహుబలి కేసిఆర్‌కు ఏమైంది?: పొరపాటు ఎక్కడ జరుగుతోంది!..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: "బాహుబలి లాంటి కేసీయార్ రోజురోజుకీ భల్లాలదేవుడి బంగారు విగ్రహంలా తయారవుతున్నాడేమో!! ఒక భక్తుడిగా నా బాధ.." ఇదీ సోషల్ మీడియాలో ఒక కేసీఆర్ అభిమాని ఆవేదన. నిజమే.. కేసీఆర్ కు అసలేమైంది?.. తొలి రోజుల్లో అన్ని వర్గాల చేత శెభాష్ అనిపించుకున్న ఆయన నిర్ణయాలు.. ఇప్పుడెందుకు బెడిసికొడుతున్నాయి.

లోపమెక్కడుంది? అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు.. ఆ లోగుట్టు కేసీఆర్ అనుచర గణం, ఆయన యంత్రాంగానికే తెలియాలి అన్న సమాధానం వినిపిస్తోంది. వారి చర్యలు, కార్యాలు ప్రతిపక్షాల ఉనికికి ఊతమిచ్చేలా పరోక్షంగా వారు సహకరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో కేసీఆర్ ఎక్కువగా వ్యతిరేకతను మూటగట్టుకున్న ధర్నా చౌక్ అంశమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. జరగాల్సిందంతా.. జరిగాక.. అసలు ధర్నా చౌక్ ఎత్తేస్తామని అధికారికంగా మేమెక్కడ చెప్పలేదే? అని టీఆర్ఎస్ నేతలు టీవీల్లో చెప్పుకురావడం ప్రజలను వారు అమాయకులుగా భావించడం లాగే కనిపించింది. ఆ విషయంలో ప్రతిపక్షాలదే తప్పు అని సొంత మీడియాతో ఎంత కవరేజీ ఇచ్చుకున్నా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.

పరేడ్ గ్రౌండ్‌పై ప్రశ్న

పరేడ్ గ్రౌండ్‌పై ప్రశ్న

వాకర్స్ కు ఇబ్బంది కలుగుతుందని ధర్నా చౌక్ ను అక్కడి నుంచి ఎత్తివేయాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్ కు ఇప్పుడు జనం నుంచి ఊహించని ప్రశ్న ఎదురవుతోంది. పరేడ్ గ్రౌండ్ లో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో.. మరి ఇక్కడి వాకర్స్ కు, క్రీడాకారులకు ఇబ్బంది తలెత్తదా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

డీఎస్సీ ఊసేది

డీఎస్సీ ఊసేది

15రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. ప్రభుత్వం చెప్పిన ఈ మాటను విని వినీ నిరుద్యోగులంతా తీవ్ర అసంతృప్తిలో కూరుకుపోయారు. అయినా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇటీవల మంత్రి కడియం శ్రీహరి '15రోజుల్లో డీఎస్సీ' నోటిఫికేషన్ అని ప్రకటించినా.. ఇంతవరకు మళ్లీ దాని ఊసే లేదు.

ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికీ ఇలా అనేకసార్లు ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులను ఊరించి ఉసూరమనిపించింది. ఇన్నిసార్లు ప్రభుత్వం మాటను నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందుతుంటే.. ఎవరికి మాత్రం వ్యతిరేకత పెరగదు. ఈ జాప్యానికి సంబంధించిన కారణాలేమైనప్పటికీ.. అందరి దృష్టి కేసీఆర్ మీదనే కాబట్టి.. జనమంతా మంత్రులనో, ఇంకెవరినో నిలదీయడం కాకుండా.. సూటిగా ఆయన్నే ప్రశ్నిస్తున్నారు.

కవులు, రచయితల సమావేశం:

కవులు, రచయితల సమావేశం:

ఇటీవల కవులు, రచయితలతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశం కూడా వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఉద్యమానికి తమ పాటతో ఊపిరి పోసిన పలువురు ప్రజాకవులు కనిపించకపోవడం, అదే సమయంలో ఆంధ్రాకు చెందిన సినీ కవి అనంత శ్రీరామ్, ఉద్యమంలో పాలుపంచుకోని ఉత్తేజ్, చంద్రబోస్ వంటి వారిని సమావేశానికి పిలవడం విమర్శలకు దారితీసింది.

ఈ విషయంలోను ఆయన చుట్టూ ఉన్న అనుచరుల ప్రమేయమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశానికి ఎవరెవరిని ఆహ్వానించాలన్న విషయాలను వారే దగ్గరుండి పర్యవక్షించినట్లు సమాచారం. ముందస్తు ప్రణాళిక లేకుండా సమావేశాన్ని ఏర్పాటు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. యథావిధిగా ఈ అంశం కూడా కేసీఆర్ మెడకే చుట్టుకుంది.

ఓయూలో మాట్లాడి ఉండాల్సిందేమో!:

ఓయూలో మాట్లాడి ఉండాల్సిందేమో!:

వందేళ్ల ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించకుండా వెనుదిరగడం కూడా ఆయన వైఫల్యాన్ని ఎత్తిచూపిందని చాలామంది విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే కానీ, మాటల మాంత్రికుడు కేసీఆర్ కు వారికి నచ్చజెప్పడం అసాధ్యం మాత్రం కాదేమో!

అదే వేదిక నుంచి విద్యార్థుల ఉద్యోగాలకు సంబంధించిన హామిని కేసీఆర్ ఇచ్చి ఉంటే విమర్శలు మూటగట్టుకుని ఉండేవారు కాదు. కానీ ఈ విషయంలోను కేసీఆర్ చుట్టూ ఉన్నవారే ఆయన్ను తప్పుదోవ పట్టించారన్న ప్రచారం జరుగుతోంది.

సింగరేణి విషయంలో కోదండరాంపై ఎటాక్!:

సింగరేణి విషయంలో కోదండరాంపై ఎటాక్!:

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఉద్యోగుల చేసిన సమ్మె చరిత్ర విస్మరించదు. అంతగా తెలంగాణ ఉద్యమానికి తోడ్పడిన సింగరేణి కార్మికులకు.. దశాబ్దాల కల అయిన డిపెండెంట్ జాబ్స్ ను పునరుద్దరిస్తానని చెప్పి కేసీఆర్ వారిలో ఆశలు రేపారు. తీరా ఎవరో వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడంతో.. ఈ నిర్ణయం బెడిసికొట్టినట్లయింది.

ఇదంతా పక్కనపెడితే.. మొత్తం వ్యవహారాన్ని కోదండరాం మెడకు చుట్టాలని టీఆర్ఎస్ వర్గాలు ప్రయత్నించడం.. ఆ పార్టీని నైతికంగా మరింత దెబ్బతీసింది. ఎలాగైనా హామిని నిలబెట్టుకుంటామని చెప్పాల్సింది పోయి.. అంతా కోదండరామే చేశారు అని టీఆర్ఎస్ నేతలు పాటందుకోవడం.. జనాలకు సైతం వారి మాటల పట్ల విశ్వసనీయత తగ్గేలా చేసింది.

నిజానికి ఈ విషయంలోను కేసీఆర్ ప్రమేయం కన్నా.. టీఆర్ఎస్ శ్రేణులే 'కోదండరాం'ను ఎటాక్ చేసే కార్యక్రమాన్ని ముందేసుకున్నట్లు కనిపించాయి. దీంతో టీఆర్ఎస్ హామిల పట్ల సింగరేణి కార్మికులకు మరింత వ్యతిరేకత ఏర్పడే పరిస్థితి తలెత్తింది. ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ కిషన్ రెడ్డి.. బొగ్గు బావుల మీద పర్యటన కూడా చేసొచ్చారు.

కేసీఆర్ గమనించట్లేదా?:

కేసీఆర్ గమనించట్లేదా?:

నిజానికి కేసీఆర్ ఇంకొకరి సూచన మేరకు నడుచుకోవాల్సిన అవసరమేముంది? అంతా ఆయన నిర్ణయం మేరకే నడుచుకుంటారు కదా! అనుకోవచ్చు. అయితే కొన్ని కీలక విషయాల్లో ఆయన అనుచరఘనం జోక్యం వల్లే ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లుగా చర్చ జరుగుతోంది.

ఇదే గనుక నిజమైతే.. కేసీఆర్ వెంటనే నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టడం మంచిదేమో! లేదంటే, ఉద్యమ సమయంలో కేసీఆర్ ను విపరీతంగా అభిమానించిన వారు సైతం ఆయన పట్ల వ్యతిరేక భావాన్ని ఏర్పరుచుకోవడం ఖాయం. ఈ పరిస్థితి రాకముందే

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its an analysis about why kcr decisions are not getting acceptance in from people in recent days, what is the reason behind it?
Please Wait while comments are loading...