'కేవీపీతో కేటీఆర్ భేటీ వెనుక మర్మమేంటి?'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావుతో రహస్యంగా మంతనాలు జరిపారని, వాటి వివరాలు ఏమిటో వెల్లడించాలని తెలుగుదేశం పార్టీ మీడియా ప్రతినిధి రాజారామ్ యాదవ్ శనివారం డిమాండ్ చేశారు. కేసీఆర్, కేవీలు ఉద్యమ సమయంలో పరస్పరం విమర్శలు చేసుకున్నారన్నారు.
టీడీపీకి కొడాలి ఝలక్
తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ప్రధాన కార్యదర్శి కొడాలి రవి కుమార్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఆయన తెరాసలో చేరుతారని సమాచారం.
విద్యార్థి దశనుంచే నాయకత్వ లక్షణాలు రావాలి: జగదీశ్వర్ రెడ్డి

నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశ నుంచే రావాలని, అందుకు ఉద్యమాల్లోకి రావాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కోదాడలో ఆయన మాట్లాడారు. మన చుట్టూ ఉన్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి నడుం బిగించేవాడే నాయకుడన్నారు.
వామపక్ష విద్యార్థి సంఘాలకు అటువంటి లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. కార్పొరేట్ విద్యావిధానాన్ని నిర్వీర్యం చేసేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలు నడపనున్నట్టు చెప్పారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ కీలక సమయంలో ఎస్‌ఎ్‌ఫఐ మహాసభలు జరుగుతున్నాయని, విద్యా సమస్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించి ప్రభుత్వం ముందుంచాలని సూచించారు.












Click it and Unblock the Notifications