సీఎం గా వై నాట్ సీతక్క.. ఎమ్మెల్యే సీతక్కనే లేటెస్ట్ ట్రెండింగ్!!
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రేవంత్ రెడ్డి చేసిన సీతక్క సీఎం అంటూ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎన్నారైలు కోరగా అందుకు రేవంత్ రెడ్డి దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రమే కాదు అవసరమైతే సీతక్కను సీఎం కూడా చేయొచ్చని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపాయి.
కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు అలుపెరగకుండా సేవలు చేసిన సీతక్కకు ఉన్న మంచి పేరు నేపథ్యంలో ఆమె సీఎం ఎందుకు కాకూడదు అన్న చర్చ ప్రస్తుతం జరుగుతుంది. ఇదే సమయంలో గూగుల్ సెర్చ్ లో సీతక్క గురించి, సీతక్క ప్రస్థానం గురించి పలువురు అనేక విషయాలను సెర్చ్ చేస్తున్నారు. సీతక్క గూగుల్ సెర్చ్ లో ట్రెండింగ్ లో ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తర్వాత సీతక్క గురించి పెద్ద ఎత్తున నెటిజన్లు సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్ ఇంజన్లో గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలు పరంగా ఎక్కువ సెర్చ్ చేసింది సీతక్క బయోడేటా గురించి అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
తెలంగాణ పిసిసి రేవంత్ రెడ్డి సీతక్క పేరును ముఖ్యమంత్రిగా ఎందుకు చేయకూడదు అని ప్రకటించడంతో చాలా మంది సీతక్కకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ లో వెతికారు .ముఖ్యంగా సీతక్క అసలు పేరు ఏమిటి? ఆమె ఏం చదువుకున్నారు? గతంలో మావోయిస్టు గా ప్రస్థానం ఏమిటి? సీతక్క ఎంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ? సీతక్క కుటుంబ నేపథ్యం తదితర వివరాలు ఏమిటి అన్నది సెర్చ్ చేస్తున్నారు.
సీతక్క ప్రసంగాలు సీతక్క రాజకీయ ప్రస్థానం తో సహా కాంగ్రెస్ పార్టీలో ఆమెకున్న ప్రాధాన్యం పైన కూడా నెటిజన్లు సెర్చ్ ఇంజన్లో వెతికారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా గూగుల్ ట్రెండింగ్ లో సీతక్క అలియాస్ ధనసరి అనసూయ పేరు సెర్చ్ ఇంజన్ లో మొదటి ప్లేస్ లో ఉండటం గమనార్హం.
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి సీతక్క ఎందుకు సీఎం అభ్యర్థి కాకూడదు అన్న చర్చ కూడా జోరుగానే జరుగుతుంది. ప్రజా ప్రతినిధి అంటే ఇలా ఉండాలి అనే విధంగా సీతక్క పని చేస్తారు. చాలా సామాన్యంగా ఉంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని, వారి సమస్యలను పరిష్కరించడానికి సీతక్క ఎంతగానో కృషి చేస్తారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాజకీయ నాయకులకు భిన్నంగా చాలా నిజాయితీగా పని చేసే సీతక్క కి ఎందుకు సీఎంగా అవకాశం ఇవ్వకూడదు అన్న చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications