'కేసీఆర్‌కు మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటే..': ఏపీలో కేసీఆర్‌పై భగ్గు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ ఇవ్వకపోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని సిపిఐ నేత నారాయణ ఆదివారం నాడు అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ ఇవ్వకపోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని సిపిఐ నేత నారాయణ ఆదివారం నాడు అన్నారు. అపాయిమటుమెంట్ ఇవ్వకపోవడం ఏమిటన్నారు.
ఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. పోరాటాలతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో అధికారులు, రాజకీయనేతల పాత్రలకు సంబంధించి, మరిన్ని ఆధారాలతో త్వరలో కోర్టులో మరో రిట్ దాఖలు చేస్తానని చెప్పారు.

తిరుపతిలో ధర్నా
ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు తీసుకువెళ్లాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో ఎస్సీలు ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బైటాయించి నిరసన తెలిపారు. కేసీఆర్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications