మీ పార్టీ నిర్వాకానికి దేశం మొత్తం క్షమాపణ చెప్పాలా: మోడీకి కేటీఆర్ సూటి ప్రశ్న

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నాయకురాలు నుపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యల దుమారం తగ్గట్లేదు. మరింత రాజుకుంటూనే వస్తోంది. అరబ్ దేశాలు ఈ వ్యాఖ్యలకు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. తమ నిరసనలను తెలియజేస్తోన్నాయి. తమ దేశాల్లోని భారత రాయబారులు, హైకమిషనర్లకు సమన్లను సైతం జారీ చేయడానికి వెనుకాడట్లేదు గల్ఫ్ దేశాలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల దేశం తరఫున వివరణలను కోరుతున్నాయి.

ముస్లిం సమాజంపై దాడిగా..

ముస్లిం సమాజంపై దాడిగా..

ఖతర్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ దేశాలు ఈ కామెంట్స్ పట్ల మండిపడుతున్నాయి. భారత్- క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టాయి. ఒమన్ అధినేత షేక్ అల్-ఖలీలీ మరో అడుగు ముందుకేశారు. బీజేపీ నేతలు మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను.. ముస్లిం సమాజంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. భారతీయ ఉత్పత్తుల బహిష్కరణకు సైతం పిలుపునిచ్చాయంటే ఆయా దేశాల్లో ఈ వ్యాఖ్యల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

భగ్గుమంటోన్న టీఆర్ఎస్..

ఇటు జాతీయస్థాయి ప్రతిపక్ష పార్టీలు కూడా బీజేపీపై దాడి మొదలు పెట్టాయి. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న తెలంగాణ రాష్ట్ర సమితి- మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన కామెంట్స్‌ను తప్పు పట్టింది. బీజేపీ నాయకులు చేసిన నిర్వాకానికి దేశం యావత్తూ క్షమాపణ చెప్పాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొంది. అరబ్ దేశాల్లో భారత్ తలదించుకునేలా చేశారని మండిపడింది.

దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి..?

దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి..?

ఈ వివాదంపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ-మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. కొద్దిసేపటి కిందటే వరుస ట్వీట్లు సంధించారు. వాటిని మోడీకి ట్యాగ్ చేశారు. బీజేపీ నాయకులు చేసిన పనికి దేశం మొత్తం అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణ చెప్పాలని నిలదీశారు. పార్టీ పరంగా బీజేపీ క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఆ పని చేయాల్సింది దేశం కాదని గుర్తు చేశారు.

అప్పుడే స్పందించివుంటే..

బీజేపీ నాయకులు తొలుత అంతర్జాతీయ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మనుషుల మధ్య వైషమ్యాలను పెంచి పోషిస్తోన్నందుకు ప్రతి భారత పౌరుడినీ క్షమాపణలు కోరాలని అన్నారు. భోపాల్‌కు చెందిన బీజేపీ లోక్‌సభ సభ్యురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్.. ఇదివరకు జాతిపిత మహాత్మాగాంధీపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తన ట్విట్టర్ పోస్టుల్లో ప్రస్తావించారు. మహాత్ముడిపై బాధ్యత గల సొంత పార్టీ ఎంపీ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేసినప్పుడు మోడీ మౌనంగా ఉన్నారని గుర్తు చేశారు.

 మోడీ మౌనం..

మోడీ మౌనం..

దాని ఫలితంగానే ఇప్పుడీ దుస్థితి ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన సమయంలో మోడీ, ఇతర బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు మౌనం దాల్చడం వల్ల అలాంటి వారిని మరింత ప్రోత్సహించినట్టయిందని పేర్కొన్నారు. అప్పుడే చర్యలకు దిగివుంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+