పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ టీమ్ కు ఎందుకు ఓటెయ్యాలి? కేటీఆర్ లాజిక్; ఇంట్రెస్టింగ్!!
తెలంగాణా రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చింది. కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టి పాలనా పగ్గాలను రేవంత్ రెడ్డి చేతికి అందించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలనలో తన దూకుడును కొనసాగిస్తున్నారు. ఇక తెలంగాణాలో ఓటమి పాలైనప్పటికీ తెలంగాణా గళం, తెలంగాణా దళం మేమే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార కాంగ్రెస్ పై చిన్న అవకాశం దొరికినా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇక తాజాగానూ వచ్చే లోక సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కే ఎందుకు ఓటు వెయ్యాలి అన్న అంశాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వివరించి చెప్పారు. పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కోరారు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కేసీఆర్ టీమ్ కు ఎందుకు ఓటు వేయాలి? అన్నది చెప్పిన ఆయన తెలంగాణ గళం బిగ్గరగా మరియు స్పష్టంగా పార్లమెంట్ లో వినిపిస్తుందని నిర్ధారించుకోవడానికి వెయ్యాలన్నారు. 16వ మరియు 17వ లోక్‌సభ గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ తమ గళాన్ని పార్లమెంట్ లో ఎంత బలంగా వినిపించిందో అర్ధమవుతుందని చెప్పారు.
BRS పార్టీ ఎంపీలు తెలంగాణ హక్కులు మరియు ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మరియు డిమాండ్ చేయడం మిగతా పార్టీల కంటే బలంగా చేశారని పేర్కొన్నారు.16, 17 లోక్ సభల్లో బీఆర్ఎస్ ఎంపీలు మొత్తం 4754 ప్రశ్నలు అడిగితే, కాంగ్రెస్ 1271 , బీజేపీ 190 ప్రశ్నలు మాత్రమే అడిగారని చెప్పారు.
2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ అని పేర్కొన్న కేటీఆర్ 2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమే అన్నారు. నాడు .. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం ...తెలంగాణ దళం.. మనమే అని పేర్కొన్నారు కేటీఆర్.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications