భర్తతో గొడవ: కొరికేసింది.. సీన్ కట్ చేస్తే..!

భర్త నాలుక భార్య కోరికేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఠాకూర్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. భార్య భర్త నాలుక కొరకటానికి గల కారణం తెలిస్తే మాత్రం షాక్ అవ్వటం పక్కా!!

మహిళలలోనూ రోజురోజుకీ క్రూరత్వం పెరిగిపోతుంది. ఒకప్పుడు భర్తలు భార్యలను హింసించి, హత మారిస్తే, ఇప్పుడు భార్యలు భర్తలను హింసించడం, అత్యంత దారుణంగా హతమార్చడం, రకరకాల చర్యలతో రాక్షసానందం పొందడం మనం చూస్తున్నాం. ఇక అటువంటి షాకింగ్, ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఠాకూర్ గంజ్ ప్రాంతంలో జరిగింది.

ఒక భార్యను భర్త పుట్టింటి నుండి ఇంటికి రావాలని అడిగినందుకు ఆ భార్య భర్తతో గొడవపడి అమాంతం భర్త నాలుకను కొరికిపారేసింది. షాకింగ్ అనిపించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. సల్మా అనే మహిళ తన పిల్లలతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఠాకూర్ గంజ్ ప్రాంతంలో తన తల్లి ఇంట్లో కొంతకాలంగా ఉంటుంది. ఇక భర్త పుట్టింట్లో ఉన్న ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి అత్తగారింటికి వెళ్ళాడు. ఆమె భర్తతో తిరిగి వెళ్లడానికి నిరాకరించింది. దీంతో భార్యాభర్తలు ఇరువురి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది.

wife bites off her husbands tongue in UP.. shock if you know the reason!!

భర్త కోపంలో భార్యపై ఉమ్మి వేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో, భార్య తన భర్తను పట్టుకొని అతని నాలుకను గట్టిగా కొరికి పారేసింది. దీంతో అది తెగి నేలపై పడింది. ఊహించని పరిణామానికి భర్తతో పాటు సల్మా తల్లి కుటుంబం కూడా షాక్ కు గురయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మున్నా కూడా నేలపై పడిపోయాడు. దీంతో పోలీసులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త మున్నా మాట్లాడలేకపోతున్నాడు. భర్త నాలుకను కొరికి పారేసిన భార్య సల్మాను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మున్నా, సల్మాల మధ్య చాలా ఏళ్లుగా వివాదం నడుస్తుంది. భర్త పట్ల భార్య తీవ్ర ఆగరహంతో ఉంది. ఇక ఇదే విషయాన్ని పశ్చిమ ఏడీసీపీ చిరంజీవ్ నాథ్ సింఘా తెలిపారు.

wife bites off her husbands tongue in UP.. shock if you know the reason!!

సినిమాల ప్రభావమో, లేక మనుషుల్లో పెరుగుతున్న హింసాత్మక ప్రవృత్తికి నిదర్శనమో తెలీదు కానీ ఇలాంటి ఘటనలు సభ్య సమాజ పోకడలకు అద్దం పడుతున్నాయి. చిత్ర విచిత్రంగా దాడులు చెయ్యటం, శరీర భాగాలు నరకటం, సైకోల మాదిరిగా హింసకు గురి చెయ్యటం అటు పురుషుల్లోనూ, మహిళలలోనూ పెరిగిపోతుంది. ఈ పరిస్థితులు ప్రస్తుతం సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

wife bites off her husbands tongue in UP.. shock if you know the reason!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+