Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దొంగతనం చేశాడని భార్య ఫిర్యాదు: నటుడు సామ్రాట్ అరెస్ట్, సైకో, గే, రాత్రుళ్లు చాటింగ్.. హర్షిత సంచలనం

Recommended Video

    అనుష్క ఆన్‌స్క్రీన్ భర్త అరెస్ట్, సైకో, గే, రాత్రుళ్లు చాటింగ్

    హైదరాబాద్: టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదయింది. భార్య ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఇంట్లో దొంగతనం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

    చదవండి: నటుడు సామ్రాట్‌కు అమ్మాయిలతో సంబంధం, నా కూతుర్ని సుఖపెట్టలేదు: తండ్రి, హర్షిత కంటతడి

    నటుడు సామ్రాట్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఇది రెండోసారి. గతంలో భార్య వరకట్నం కేసు పెట్టగా, ఈసారి దొంగతనం కేసు పెట్టింది. ఆ కేసు విచారణ జరుగుతుండగా ఈ కేసు నమోదు కావడం గమనార్హం.

     గతంలోను ఇతనిపై ఫిర్యాదు

    గతంలోను ఇతనిపై ఫిర్యాదు

    గతంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కూడా భార్య అతనిపై వరకట్నం కేసు పెట్టింది. తనను వేధిస్తున్నాడని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 498/ఏ కింద ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తాజాగా దొంగతనం కేసు పెట్టడం గమనార్హం.

     కేసులో ప్రాథమిక సాక్ష్యాలు

    కేసులో ప్రాథమిక సాక్ష్యాలు

    ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. దీంతో మంగళవారం ఉదయం అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. సామ్రాట్ రెడ్డితో పాటు అతడి సోదరి సాహితీ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. కొంతకాలంగా సామ్రాట్‌కు అతని భార్యతో విభేదాలు ఉన్నాయి. దీంతో రెండు నెలలుగా ఇరువురు వేర్వేరుగా ఉంటున్నారు.

     ఇంట్లో లేని సమయంలో

    ఇంట్లో లేని సమయంలో

    తాను ఇంట్లో లేని సమయంలో సామ్రాట్ వచ్చి.. తనకు చెందిన వస్తువులుగా చెబుతూ పలు విలువైన వస్తువులను తీసుకు వెళ్లాడని ఆమె ఫిర్యాదు చేశారు. సామ్రాట్ పంచాక్షరి, బావా, దేనికైనా రెడీ తదితర చిత్రాల్లో నటించారు.

    పలు చిత్రాల్లో నటించాడు

    పలు చిత్రాల్లో నటించాడు

    సామ్రాట్ పలు తెలుగు చిత్రాల్లో నటించారు. వీరి పెళ్లి కొంతకాలం క్రితం జరిగింది. ఈ వివాహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కొన్నాళ్లు బాగానే ఉన్న వారు ఆ తర్వాత భార్యా, భర్తల మధ్య గొడవ వచ్చినట్లుగా తెలుస్తోంది.

     హర్షిత తీవ్ర ఆరోపణలు

    హర్షిత తీవ్ర ఆరోపణలు

    తన భర్త సామ్రాట్ రెడ్డిపై భార్య హర్షిత తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త చాలా దుర్మార్గుడని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను కేసు పెట్టానని చెప్పింది. ఎంతో సహనంగా, ఎన్ని కష్టాలు పెట్టినా మౌనంగా ఉన్నానని, ఓ సైకోలా మారి హింసించాడని దీంతో విధిలేని పరిస్థితుల్లోనే దూరంగా ఉన్నానని వాపోయింది.

    నటుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకున్నా

    నటుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకున్నా

    వాస్తవానికి నటుడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేకున్నా, ఆ రంగం నుంచి బయటకు వస్తానని సామ్రాట్ చెప్పడంతో పెళ్లాడినట్లు హర్షిత చెప్పింది. తన అత్త కూడా ఎంతో వేధించేదని ఆరోపించింది. కట్నం తీసుకు రావాలని వేధిస్తున్నందున గతంలో కేసు పెట్టానని, గృహోపకరణాలను, విలువైన వస్తువులను చెప్పకుండా తీసుకు వెళ్లాడని ఆరోపించింది.

    అతనో గే, మగ స్నేహితులు

    అతనో గే, మగ స్నేహితులు

    తన భర్త సామ్రాట్‌కు ఎంతో మంది మగ స్నేహితులు ఉన్నారని, అతనికి, తనకు ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా తన భర్త ఓ గే అని తెలుసుకుని హతాశురాలినయ్యానని హర్షిత సంచలన ఆరోపణలు చేసింది. ఆమె ఉదయం ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. బయటకు వెళ్లినప్పుడు, కారు డ్రైవింగ్ సీట్లో తనను కూర్చోబెట్టి, లేడీ డ్రైవర్ మాదిరిగా చూస్తుండేవాడని చెప్పింది.

    బాధపడ్డానే తప్ప, ఎదురు చూశా

    బాధపడ్డానే తప్ప, ఎదురు చూశా

    బయటకు తీసుకువెళ్లిన సమయంలో తనతో బాగున్నట్టు నాటకాలు ఆడుతూ ఇంటికి వచ్చాక శారీరకంగా, మానసికంగా వేధించేవాడని హర్షిత చెప్పింది. అతని గురించి ఎన్ని విషయాలు తెలిసినా మనసులో బాధపడ్డానే తప్ప బయట పడలేదని, ఎప్పటికైనా మారుతారన్న ఆశతో చాన్నాళ్లు ఎదురు చూశానని చెప్పింది. తన తండ్రి షేర్లను ట్రాన్స్ ఫర్ చేసేందుకు అంగీకరించక పోవడంతో గత ఏడాదిగా వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పింది.

    రాత్రుళ్లు చాటింగులు, నాతో ఉద్యోగం

    రాత్రుళ్లు చాటింగులు, నాతో ఉద్యోగం

    తన పక్కనే కూర్చుని రాత్రంతా చాటింగ్‌లు చేస్తుండేవాడని, అడిగితే కొట్టాడని హర్షిత ఆరోపించింది. ఎప్పుడూ హుక్కా సెంటర్లలో తిరుగుతుంటాడని, తనకు ఆ వాసన పడదని చెప్పినా వినేవాడు కాదని చెప్పింది. గంటలు గంటలు కూర్చుని హుక్కా, డ్రగ్స్ తీసుకునేవాడని చెప్పింది. ఖర్చులకు కావాల్సిన డబ్బుల కోసం తనతో ఉద్యోగం కూడా చేయించాడని, ఇంట్లో కూర్చుని డబ్బులకు వేధించేవాడని మండిపడింది. తన సేఫ్టీ కోసం తన తండ్రి సీసీటీవీ కెమెరాలను ఇంట్లో పెట్టించడం వల్లే పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లభించిందని చెప్పింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+