నటుడు సామ్రాట్‌కు అమ్మాయిలతో సంబంధం, నా కూతుర్ని సుఖపెట్టలేదు: తండ్రి, హర్షిత కంటతడి

Recommended Video

    నటుడు సామ్రాట్‌ కేసు మలుపులు : హర్షితతో రాజీ: 14 రోజుల రిమాండ్

    హైదరాబాద్: భార్యను వేధించిన కేసులో అరెస్టైన సినీ నటుడు సామ్రాట్ పైన అతని మామ కృష్ణారెడ్డి, అత్త మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. సామ్రాట్ డ్రగ్స్‌కు బానిస అయ్యాడని ఆరోపించారు. అతనికి అమ్మాయిలు, పబ్బులు అలవాటు అని చెప్పారు.

    తమ అమ్మాయిను ఎప్పుడూ కూడా అతను సుఖపెట్టలేదని వాపోయారు. సామ్రాట్ వ్యక్తిగత సమస్యను ఆతని తండ్రికి తాము ముందే చెప్పామని చెప్పారు. వైద్య పరీక్షలు చేయిస్తామని చెప్పిన అతను, ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. తన కూతురును చంపేందుకు చాలాసార్లు ప్రయత్నించాడని చెప్పారు.

     ఆస్తిపై కన్ను, రచ్చ చేసేవాడు,

    ఆస్తిపై కన్ను, రచ్చ చేసేవాడు,

    సామ్రాట్‌కు, తల్లిదండ్రులకు తమ ఆస్తి పైన కన్ను పడిందని అత్తామామలు చెప్పారు. సామ్రాట్ చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసి నానా రచ్చ చేసేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు ఇస్తానని చెప్పి తరుచూ తన కూతురును బెదిరించాడని చెప్పారు. పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశామని, కానీ వేధింపులు ఎక్కువయ్యాయన్నారు.

     ఒప్పందం పక్కన పెట్టి

    ఒప్పందం పక్కన పెట్టి

    సినిమాల్లో నటించనని చెప్పిన తర్వాతనే తన కూతురును సామ్రాట్‌కు ఇచ్చి పెళ్లి చేశానని హర్షిత తండ్రి వాపోయారు. పెళ్లైన తర్వాత ఒప్పందాన్ని పక్కన పెట్టి సినిమాల్లో నటించడానికి అంగీకరించడం, తన కూతురు పేరుపై ఉన్న ఆస్తులు బదలాయించాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు.

     మా కూతురు లేని సమయంలో ఎత్తుకెళ్లాడు

    మా కూతురు లేని సమయంలో ఎత్తుకెళ్లాడు

    గత ఏడాది నవంబర్ 30వ తేదీన అదనపు కట్నం అంశంపై రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. తన కూతురుకు ప్రాణహానీ ఉందని కృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 25న తన కూతురు ఇంట్లో లేని సమయం చూసి సామ్రాట్ తాళాలు పగులగొట్టి వస్తువులు చోరీ చేశాడని ఆరోపించారు.

    అమ్మాయిలతో సంబంధాలు... భార్య కంటతడి

    అమ్మాయిలతో సంబంధాలు... భార్య కంటతడి

    తన భర్త సామ్రాట్‌కు ఇతర అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, మాదక ద్రవ్యాలు కూడా వాడుతున్నాడని భార్య హర్షిత రెడ్డి మరిన్ని ఆరోపణలు చేశారు. వివాహం అయినప్పటి నుంచి కట్నం కోసం తనను తీవ్రంగా వేధించడమే కాకుండా చిత్రహింసలు పెట్టేవాడని కంటతడి పెట్టింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+