దారుణం: భార్య ఫుల్‌గా మద్యం తాగేసి భర్తనే చంపేసింది
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించిన మహిళ ఆ మత్తులో భర్తను హత్య చేసింది. ఈ సంఘటన కరీంనగర్‌లోని బేడ బుడగ జంగాల కాలనీలో మంగళవారం తెల్లవారు జామున జరిగింది.
బండరాళ్లతో మోది భార్య భర్తను ఆమె చంపేసింది. కరీంనగర్‌లోని బేడ బుడగజంగాల కాలనీలో సిరిగి మల్లయ్య (60) భార్య ఎల్లవ్వతో కలిసి నివాసం ఉంటున్నాడు. పాత ఇనుప సామగ్రి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు.

ఎప్పటిలాగే అతను....
రోజులాగానే మల్లయ్య పనికి వెళ్లి రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఎల్లవ్వకు కూడా మద్యం సేవించే అలవాటు ఉంది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ స్థితిలోనే మద్య మత్తులో ఉన్న ఎల్లవ్వ వేకువజామున బండరాళ్లతో మోది భర్తను హత్య చేసింది

ఆ తర్వాత చీరను కాల్చేసింది....
భర్తను చంపిన తర్వాత రక్తం మరకలు అంటిన చీరను కాల్చి వేసింది. హత్యకు వాడిన బండరాళ్లు పక్కన పడేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా నటిస్తూ తన భర్త కిందపడి చనిపోయాడని స్థానికులకు చెప్పింది. వారు వచ్చి చూడడంతో విషయం బయటపడింది.

స్థానికుల సమాచారంతో....
స్తానికులు సమాచారంతో టౌన్ సిఐ ప్రకాష్, ఎస్ఐ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్తలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులు విచారించారు. ఎల్లవ్వ మతిస్థిమితం కోల్పోయిందని తెలిసింది.

మద్యం మత్తులోనే...
మద్యం మత్తులోనే ఎల్లవ్వ భర్తను చంపేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఐదుగురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.












Click it and Unblock the Notifications