చున్నీతో ఉరేసి భర్తను చంపిన భార్య
కరీంనగర్/ హైదరాబాద్: కరీంనగర్ పట్టణ శివారు ప్రాంతంలో భర్తను ఓ భార్య హత్య చేసింది. మృతుడు ఎండీ సాబీర్(45) గత కొంత కాలంగా రోజు మద్యం తాగివచ్చి గొడవ చేస్తుంటే అది తట్టుకోలేకనే షహనాజ్ చున్నితో అతని మెడకు బిగించి హత్యచేసినట్లు తెలుస్తోంది.
తొలుతుప ఈ ఘటనను ఆత్మహత్యగా ఆమె తెలిపినా తరువాత పోలీసు విచారణలో తానే హత్య చేశానని షహనాజ్ అంగీకరించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విద్యుత్ షాక్‌తో రైతు మృతి

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం ధర్మారం పంచాయతీలోని మసిరెడ్డి తండాలో ఓ రైతు విద్యుత్‌షాక్‌తో మరణించాడు. తండాలో రైతు మృతి ఘటనతో విషాదం అలముకుంది. విద్యుత్ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
హైదరాబాదులో చైన్ స్నాచింగ్
హైదరాబాద్ నగరంలో చైన్‌స్నాచర్‌ల ఆగడాలకు కళ్లెం పడడం లేదు. నిలోఫర్ ఆసుపత్రి దగ్గర గుర్తు తెలియని వ్యక్తి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలు ఓ ప్రైవేటుస్కూల్‌లో ఆయాగా పనిచేస్తున్న రాజమణిగా గుర్తించారు. నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications