భర్త ఆఫీస్ ముందు పిల్లలతో భార్య ధర్నా (ఫోటో)

హైదరాబాద్: కట్టుకున్న భర్త కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ గృహిణి ఆందోళనకు దిగింది. గురువారం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్త కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన విమలకు నగరంలోని సైనిక్‌పురికి చెందిన మనోహర్‌తో వివాహమైంది.

మనోహర్ అబిడ్స్ తిలక్ రోడ్డులోని బీమా భవన్‌లో పీఏవో కార్యాలయంలో ఆడిటర్‌గా పని చేస్తున్నారు. మనోహర్‌కు సొంతగా సుమారు రూ.10 కోట్ల మేర ఆస్తి ఉంది.

Wife stages dharna in front of husband's office

1995లో విమలను రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా అతను కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. కుటుంబ పోషణకు డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నాడని బాధితురాలు విమల ఆరోపించారు.

ఈ విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో తాను చేసేది లేక భర్త కార్యాలయం ముందే బైఠాయించానని చెప్పారు. కుటుంబ పోషణకు ప్రతి నెల జీవన భృతి చెలలించాలని, ఆస్తిలో వాటా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, విషయం తెలిసిన భర్త అక్కడి నుండి జారుకున్నారని వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+