భార్య టార్చర్ వీడియో వైరల్.. మనసును పిండేస్తున్న జానపద నటుడు గడ్డం రాజు కథ!

ఇప్పటివరకు మన సమాజంలో భార్యలను భర్తలు టార్చర్ చేయడమే బయట వినిపించేవి. కానీ ఇటీవల కాలంలో భార్యల టార్చర్ కు సంబంధించిన వీడియోలు అనేకం బయటకు వస్తున్నాయి. భర్తలను భార్యలు వేధించడం, శారీరకంగా హింసించడం, అత్యంత పాశవికంగా హత్య చేయడం వంటి అనేక ఘటనలు సభ్య సమాజం నివ్వెర పోయేలా చేస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటన తెలంగాణా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

భార్య తనను వేధింపులకు గురి చేస్తుందని సెల్ఫీ వీడియో
బతుకమ్మ పండుగ సాక్షిగా భార్య తనను వేధింపులకు గురి చేస్తుందని సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమైన జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డం రాజు ఆత్మహత్య తర్వాత ఆత్మహత్యకు ముందు అతను చివరిసారిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అత్యంత హృదయ విదారకంగా మనసును పిండేసేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది.

Wife torture video goes viral Folk singer Gaddam Raju heart-wrenching story

యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయిన రాజు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ గాని పేటకు చెందిన గడ్డం రాజు ఫోక్ సింగర్. రాజుది వ్యవసాయ కుటుంబం.చిన్నప్పటినుంచి జానపద పాటలు పాడే కళాకారుడిగా ఎదిగిన రాజు వరంగల్ జిల్లాలో నాలుగు సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని పల్లె జీవన విధానం, గ్రామాలలో ఉండే ప్రేమ ఆప్యాయతలతో కూడిన అనేక వీడియోలు చేస్తూ youtube లో సక్సెస్ సాధించారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో రాజుకు టార్చర్
గత సంవత్సరం హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన రాజు వరుసకు కోడలు అయ్యే కాగజ్ నగర్ కు చెందిన సౌందర్యతో ప్రేమలో పడ్డాడు. ఇక పెద్దలను ఒప్పించి ఐదు నెలల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో రాజు, సౌందర్యలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరి మధ్య అసలు సఖ్యత లేదని ప్రతిరోజు రాజు తల్లిదండ్రులను సౌందర్య తిడుతూనే ఉందని కన్నీరు పెట్టుకున్నాడు.

బతకలేకపోతున్నా అంటూ రాజు వీడియో
తన భార్య పెట్టే టార్చర్ భరించలేక పోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్న రాజు ప్రాణం తీసుకున్నాడు. భార్య కోసం కొన్న చీరతోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సెల్ఫీ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి మనస్థాపానికి లోనైన రాజు .. అమ్మా, బాపు... బతకలేకపోతున్నా.. నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. చాలా టార్చర్ గా అనిపిస్తోంది. నా భార్య మిమ్మల్ని ఊరికే తిడుతోంది. నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్లు అయిపోయింది.

భార్య కోసం కొన్న చీరతోనే ...
అన్నా వదిన, పిల్లలు జాగ్రత్త. సౌందర్య ఇక నువ్వు మంచిగా బ్రతుకు. నీలాంటి ఆమెకు మొగోళ్ళు సెట్ అవ్వరు. నువ్వు అన్న మాటలకు నాకు మెంటల్ టార్చర్ అవుతుంది. నాకు ఈ బతుకు బతక బుద్ధవ్వట్లేదు. నాకు బట్టలు తీసుకోవడానికి డబ్బులు లేకపోయినా భార్య కోసం కొత్త చీర కొన్నా... అమ్మ బాపు బై జాగ్రత్త అంటూ సూసైడ్ వీడియో తీసుకున్నాడు.

సోషల్ మీడియాలో రాజు వీడియో వైరల్
గడ్డం రాజు కన్నీటి పర్యంతం అవుతూ పోస్ట్ చేసిన లాస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన వాళ్లంతా పాపం ఎంత నరకం అనుభవించి ఉంటాడో.. నిండు ప్రాణం తీసుకున్నాడు అంటూ రాజు పట్ల సానుభూతి చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో మహిళల గురించి ప్రతి ఒక్కరు ఆలోచించేలా చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+