ఎన్టీఆర్ తరహాలో ఆ రికార్డును కేసీఆర్ సాధిస్తారా?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ దఫా గజ్వేల్ నియోజకవర్గం తో పాటు, కామారెడ్డి నియోజకవర్గం లోనూ పోటీ చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడంతో ఎన్టీఆర్ తరహా రికార్డును ఆయన దక్కించుకుంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా టిడిపిని స్థాపించిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలోనూ అనేక రికార్డులను సొంతం చేసుకున్నారు. ఏకకాలంలో రెండు నుంచి మూడు నియోజకవర్గాలలో పోటీ చేసిన ఆయన, పోటీ చేసిన మూడు చోట్ల విజయాన్ని దక్కించుకున్నారు. 1985 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్టీఆర్ ఏకంగా మూడు స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నల్గొండ, హిందూపురం, గుడివాడ నుండి పోటీ చేసిన ఆయనకు ప్రజలు పట్టం కట్టారు.

మరి ప్రస్తుతం కేసీఆర్ కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి గజ్వేల్ నియోజకవర్గం లోనూ, కామారెడ్డి నియోజకవర్గం లోనూ పోటీ చేస్తున్న కేసీఆర్ కు ప్రజలు పట్టం కడతారా లేదా? రెండు చోట్ల కేసీఆర్ ను గెలిపిస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కేసీఆర్ రెండు నియోజకవర్గాలలో గెలిస్తే ఎన్టీఆర్ లాగా పోటీ చేసిన ప్రతి చోట గెలిచిన ఘనతను కెసిఆర్ దక్కించుకున్నట్లు అవుతుంది.
ఏది ఏమైనా బి ఆర్ ఐ నేత కేసీఆర్ ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి తలపడుతుండడం ప్రస్తుతం రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు చాలామంది కీలక నాయకులు ఒకేసారి నియోజకవర్గాలలో పోటీ చేయడం గతంలో అనేక ఎన్నికలలో చూశాం.
సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ లోనూ, యూపీ లోను పోటీ చేయగా వయనాడ్ లో గెలిచారు. యూపీలో ఓడిపోయారు. జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఒకేసారి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక తాజాగా కేసీఆర్ కూడా రెండు చోట్ల పోటీ చెయ్యటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications