తెలంగాణా పోలీసులు శ్రీదేవిని అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ ను వదిలిపెట్టని ఆర్జీవీ!
సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడం తెలిసిందే. ఇక ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ కోర్టులో హాజరుపరచడంతో కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించగా ఆయనను చంచల్ గూడా జైలుకు తరలించారు.
రాం గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
అనంతరం తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్టుపైన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సినీ ప్రముఖుల నుంచి రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో మొదటినుంచి అల్లు అర్జున్ అరెస్టుపైన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టారు.

అల్లు అర్జున్ అరెస్ట్ తో ఆర్జీవీ పోస్ట్
గతంలో ఎన్నోసార్లు తొక్కిసలాట ఘటనలు జరిగాయని, అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయకుండా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు చేశారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 సినిమాతో తెలుగు భాషకి, తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గొప్ప ఖ్యాతిని తీసుకువచ్చిన అల్లు అర్జున్ తెలంగాణ వాసి కావడం మనందరికీ గర్వకారణం అంటూ పేర్కొన్నారు.
తాజాగా మరోమారు రామ్ గోపాల్ వర్మ ట్వీట్
తెలంగాణ రాష్ట్రానికి ఆయన గొప్ప బహుమానాన్ని ఇస్తే ప్రభుత్వం మాత్రం జైలుకు పంపి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఇంతకుముందు ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోమారు అల్లు అర్జున్ అరెస్టును ప్రతి స్టార్ వ్యతిరేకించాలని ట్వీట్ చేశారు. ఇక ఇదే సమయంలో శ్రీదేవి పేరును కూడా ఆయన ప్రస్తావించారు.
శ్రీదేవి టాపిక్ తీసి వర్మ సంచలనం
అల్లు అర్జున్ అరెస్ట్ ను ప్రతి స్టార్ వ్యతిరేకించాల్సిందేనని పేర్కొన్న ఆయన ఏ ఫిలింస్టార్ అయినా ఏ రాజకీయ నాయకుడు అయినా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకోవడం నేరమా అంటూ ఆర్జీవి ప్రశ్నించారు. తను డైరెక్షన్ చేసిన క్షణక్షణం సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవిని చూడడానికి లక్షలాది మంది జనం వచ్చారని ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారని గుర్తు చేశారు.
తెలంగాణా పోలీసులను టార్గెట్ చేసిన ఆర్జీవీ
ఎప్పుడూ తెలంగాణ పోలీసులు స్వర్గంలో ఉన్న శ్రీదేవిని అరెస్టు చేస్తారా అంటూ సెటైర్లు వేశారు. శ్రీదేవిని అరెస్టు చేయడానికి అక్కడికి వెళతారా అంటూ రాంగోపాల్ వర్మ తెలంగాణ పోలీసులపైన వ్యంగ్యాస్త్రాలు అందించారు. పాపులారిటీ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీల విషయంలో గతంలో కూడా ఇటువంటివి జరిగాయి అని పేర్కొన్న రాంగోపాల్ వర్మ అప్పుడు పోలీసులు స్పందించినప్పుడు ఇప్పుడు ఎందుకు పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేశారు అనేది చెప్పాలని ప్రశ్నించారు.
ఆర్జీవీ పోస్ట్ షేర్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్
అల్లు అర్జున్ విషయంలో వర్మ ఆర్గ్యుమెంట్ ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది. ముఖ్యంగా బన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ను పోస్ట్ చేస్తున్నారు. ఆర్జీవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications