ఆ పథకంతో తెలంగాణాకు అదనంగా 340కోట్ల రూపాయలు.. కావాలా వద్దా!
గ్రామాలకు ఆస్తులను సృష్టించే పథకం, ప్రతి ఒక్కరికి 125 రోజుల పనిని కల్పించే పథకం, నేరుగా డబ్బులు రైతుల కూలీల ఖాతాలోనే పడే పథకమైన ''వీబీ-జీ రామ్ జీ'' పథకం పై కాంగ్రెస్ అక్కసు వెళ్ళగక్కుతుంది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం వల్ల తెలంగాణకు అదనంగా రూ.340 కోట్లు రాబోతున్నాయి అని, దీనివల్ల తెలంగాణకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదొక అద్భుత పథకం : బండి సంజయ్
ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్చుకోలేక పోతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ''వీబీ-జీ రామ్ జీ'' పథకం గ్రామీణ పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే అద్భుతమైన పథకమని పేర్కొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ పథకం ద్వారా ఉపశమనం లభిస్తుందని అన్నారు.

తెలంగాణాకు అదనంగా రూ.340 కోట్లు
కరీంనగర్‌లోని త్రిధా హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ఈ నూతన చట్టబద్ధ ఉపాధిహామీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అదనంగా రూ.17వేల కోట్లు ఖర్చు చేయబోతోందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి సైతం గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.340కోట్లు అదనంగా రానున్నాయని తెలిపారు. ఈ పథకం కింద ఏటా రూ.1.51లక్షల కోట్లకు పైగా వ్యయం అవుతుందని ప్రభుత్వ అంచనాలను వెల్లడించారు.
కాంగ్రెస్ ది అనవసరపు రాద్ధాంతం
ఇంత మంచి పథకం కేంద్ర అమలు చేస్తుంటే కాంగ్రెస్ అనవసరపు రాద్ధాంతం చేస్తుందని ఆయన అన్నారు. ''వీబీ జీ రామ్ జీ'' పథకం కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో అమలవుతుందని, ఇందులో కేంద్రం వాటా రూ.95,692 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా కలిపి రూ.55,589 కోట్లు ఉంటాయని వివరించారు. గ్రామ సభల ద్వారా పనుల ఎంపిక జరగడం వల్ల గ్రామానికి అవసరమైన పనులు ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.
మీరు పథకాల పేర్లు మార్చలేదా
కేంద్ర ప్రభుత్వం గైడ్‌గా మాత్రమే వ్యవహరిస్తుందని, ఎలాంటి అజమాయిషీ ఉండదన్నారు. పథకానికి గాంధీ పేరును తీసేయడంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే పథకాల పేర్లు మార్చిన ఉదాహరణలను గుర్తు చేశారు. మహాత్ముడి ఆశయాలను తుంగలో తొక్కిన వాళ్లే ముసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ మండిపడ్డారు. వాంబే ఇళ్ల స్కీమ్ పథకంలో వాల్మీకి, అంబేద్కర్ పేర్లను ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ వి నీచ రాజకీయాలు
ఎయిర్ పోర్ట్ కు ఎన్టీఆర్ పేరును తొలగించి రాజీవ్ గాంధీ పేరు పెట్టలేదా అంటూ నిలదీశారు. మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి జరిగే ఈ నూతన పథకం కావాలా.. వద్దా అంటూ బండి సంజయ్ ప్రజలను ప్రశ్నించారు. వి బి జి రామ్ జీ పథకం పైన రాజకీయాలు చేయడం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. గ్రామీణ పేదలకు ఉపాధి, రైతులకు మేలు చేసే ఈ పథకాన్ని అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications