జాబితాలోభర్త పేరు మిస్: స్త్రీ ఆత్మహత్యాయత్నం

మూడేళ్ల కిందట తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయంలో బస్‌స్టేషన్‌లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పంటించబోయిన దీపక్ మంటలు ఒంటికి తాకి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆరు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీపక్ మృతి చెందాడు. ఈలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెరాస అధికారంలోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పొందనున్న అమరవీరుల జాబితాలో దీపక్ పేరు లేదు. దీంతో దీపక్ భార్య సబిత మంగళవారం జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులను కలిసి ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన తన భర్త పేరు ఎందుకు జాబితాలో చేర్చలేదని అధికారులను అడిగారు.
ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందే అమర వీరుల జాబితాలో తన భర్త పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సబిత మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగిన ఆమెను సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. సబితకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు.












Click it and Unblock the Notifications