వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధింపులు: కుమార్తెతో కలిసి భార్య ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: మద్యానికి బానిసైన భర్త వేధింపులు భరించలేక ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన రవితో తాడ్వాయి మండలం పస్రాకు చటెందిన మమతకు వివాహమైంది.

వీరికి ఏడాది చిన్నారి ఉంది. డ్రైవరుగా పని చేస్తున్న రవి మద్యానికి బానిసై, భార్యతో గొడవపడేవాడు. శనివారం ఉదయం మద్యం తాగి వచ్చి భార్యను తీవ్రంగా కొట్టాడు. దీనికి మమత మనస్తాపం చెంది, తలకు వేసుకునే రంగును తాగి, ఏడాది కుమార్తెకు తాగించింది.

అపస్మారక స్థితిలో ఉన్న తల్లీ కూతుళ్లను స్థానికులు వరంగల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. భర్త, అత్తల వేధింపులతోనే తన చెల్లి ఆత్మహత్యకు పాల్పడిందని మమత సోదరుడు వెంకన్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Woman commits suicide

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ మండల కేంద్రానికి చెందిన నవీన్‌ శనివారం ఉదయం ఆత్మహత్య చే సుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై శోభన్‌బాబు తెలిపారు. నవీన్‌ దుబాయ్‌ వెళ్లి నాలుగు నెలల క్రితం తిరిగి వచ్చాడని, నెల రోజుల క్రితం తండ్రి రాంచంద్రం మృతిచెందడంతో అప్పుల ఇబ్బందులు, ఇంటి సమస్యలతో మానసికంగా కుంగిపోయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై చెప్పారు.

భిక్కనూరులో చిరుత పులి సంచారం?

నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని పోతులగుట్ట సమీపంలో చిరుత సంచరిస్తోందని గ్రామస్థులు శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన రైతు తిరుపతికి తన వ్యవసాయబావికి వెళ్లే మార్గంలో చిరుత పులి కన్పిందని, అతడు భయంతో గ్రామంలోకి వచ్చి చెప్పాడని వారు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న

సర్పంచ్‌ నర్సింహా రెడ్డి అట వీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సెక్షన్‌ ఆఫీసర్లు వేణు, భీంరెడ్డి, సిబ్బంది ఫారూఖ్‌, బాబు, క్రాంతిలు వెంటనే గ్రా మానికి చేరుకొని పోతులగుట్ట సమీపంలో చిరుత కోసం వెతికారు. కానీ వారికి చిరుత జాడ దొరకలేదు. సెక్షన్‌ ఆఫీసర్‌ వేణు మాట్లాడుతూ కొన్ని రోజులుగా డివిజన్‌ పరిధిలో చిరుతపులి తిరుగుతున్నట్లు తాము గుర్తించామని, పొలాలకు వెళ్లే సమయంలో ప్రజలు తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

English summary
Woman commits suicide in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X