Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్లేన్‌లో పిలిప్ఫీన్స్ స్త్రీ ప్రసవం, హైదరాబాద్‌లో ల్యాండింగ్: నేషనాలిటీపై..

హైదరాబాద్: ఓ గర్భిణీకి విమానంలోనే నొప్పులు వచ్చి, అందులోనే ప్రసవించింది. ఆమెకు నొప్పులు రావడంతో విమానాన్ని అత్యవసరంగా హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. ఆ విమానం దుబాయ్ నుంచి పిలిఫ్పీన్స్ వెళ్తోంది.

ఈ నెల 14వ తేదీన సెబు పసిఫిక్ ఎయిర్ విమానం దుబాయ్ నుంచి ఫిలిప్పీన్స్‌లోని మనీలాకు బయలుదేరింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ గర్భిణీ అందులో ప్రయాణిస్తున్నారు. ఐదు గంటల ప్రయాణం అనంతరం గర్భిణికి నొప్పులు ప్రారంభమయ్యాయి.

తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి విషయాన్ని చెప్పారు. ఇద్దరు నర్సులతో కలిసి వచ్చిన వారు నొప్పులతో బాధపడుతున్న మహిళను సీట్లో నుంచి కాస్త విశాలంగా ఉన్న విమానం ముందు భాగానికి తీసుకెళ్లి డెలివరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా ఆమె అమ్మాయికి జన్మనిచ్చింది.

 Woman gives birth to baby girl on flight from Dubai to Philippines

ఆ తర్వాత తల్లీ బిడ్డలకు స్నానం చేయించారు. అనంతరం మహిళ తన బిడ్డను తీసుకుని తిరిగి తన సీట్లో కూర్చుని ప్రయాణించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన తోటి ప్రయాణికురాలు మిస్సీ బెర్బెరాబ్ ఉమండాల్ మొత్తం వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.

తోటి ప్రయాణికురాలు భూమికి 30వేల అడుగుల ఎత్తులో ఆకాశంలో పండంటి పాపకు జన్మనిచ్చినట్టు పేర్కొంది. అసలు సదరు మహిళ అక్టోబరులో ప్రసవించాల్సి ఉండగా, సుదూర ప్రయాణం వల్ల శరీరంలోని మార్పులతో ముందుగా ప్రసవించిందని పేర్కొంది.

ఆ మహిళ ప్రసవించింది భారత్ భూభాగంలో. నవజాత శిశువుకు వైద్య సదుపాయం అందించేందుకు విమానాన్ని భారత్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. దుబాయ్ నుంచి మనీలాకు 9 గంటలే ప్రయాణ సమయమైనా ఈ ఘటనతో పద్దెనిమిది గంటలు పట్టింది. ప్రయాణికులు ఏమాత్రం విసుగు చెందలేదు. కాగా, ఆ మహిళకు మూడు రోజుల తాత్కాలిక వీసా మంజూరు చేశారు.

పాప భారత గగనతంలో పుట్టింది కాబట్టి సాంకేతికంగా ఆమెకు భారత పౌరసత్వం రావాల్సి ఉంది. అయితే విమానం, నౌకల్లో ప్రయాణించే సమయంలో జన్మిస్తే మాత్రం ఆ నౌక, విమానం ఏ దేశానికి చెందితే ఆ దేశ పౌరసత్వం వస్తుందని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ సంస్థ తెలిపింది. సెబు విమాన సంస్థ ఫిలిప్పీన్స్‌కు చెందడంతో ఆ బిడ్డకు ఫిలిప్పీన్స్ పౌరసత్వం వస్తుంది. అయితే మహిళ ఆ దేశ పౌరురాలే కావడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+