భర్తతో వివాహేతర సంబంధం: మహిళను కత్తితో పొడిచి, చంపిన భార్య

హైదరాబాద్: బెల్టు షాప్ నడిపిస్తూ తన భర్తను మద్యానికి బానిస చేయడమే కాకుండా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

ఎల్లారెడ్డి గూడలో ఉంటున్న అమల ఇంటికి అదే ప్రాంతంలోని రాజు తరుచూ వచ్చేవాడు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని రాజు భార్య వనజకు చెప్పాడు. రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

అమల ప్రోద్బలం వల్ల రాజు ఓ మహిళతో వివాహేతర సంబంధాలు కొనసాగస్తున్నాడని ఓ వ్యక్తి చెప్పాడు. అమలతోను వివాహేతర సంబంధం ఉందని చెబుతున్నారు. దీంతో ఆమె తరుచూ భర్తతో ఘర్షణ పడేది. తాను ఎటువంటి తప్పు చేయలేదని రాజు భార్యకు చెప్పేవాడు.

 Woman kills another woman

భార్య వనజ తన భర్త రాజును వెంటబెట్టుకొని అమల ఇంటికి వచ్చింది. ఈ సమయంలో వనజ తనతో పాటు కత్తిని కూడా తీసుకు వచ్చింది. అమలతో పాటు అక్కడున్న వారు మాట్లాడుతుండగా వనజ కత్తితో అమలను గాయపర్చింది. ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందింది.

హత్య కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు బుధవారం సాయంత్రం తెలిపారు. వనజను అదుపులోకి తీసుకున్నారు. వనజపై హత్య కేసు నమోదు చేశారు. కాగా, రాజు ఆమె వద్దకు ఉదయం అయిదు గంటలకే వెళ్లి రాత్రి వరకు గడిపేవాడని ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+