మళ్ళీ గలీజ్ వివాదంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య: అసలేం జరుగుతుందంటే!!
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీరు మరోమారు వివాదాస్పదమైంది. తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని జానకిపురం మహిళా సర్పంచ్ నవ్య తాటికొండ రాజయ్య పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కావాలని తనను వేధింపులకు గురి చేస్తున్నారని, తన మాట వినకుంటే పార్టీలో స్థానం లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారని, తమ గ్రామానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. పార్టీలో పని చేసే కొందరిని మీడియేటర్లుగా పెట్టుకొని వారి ద్వారా తనపై ఒత్తిడి తెస్తున్నారని మహిళా సర్పంచ్ ఆరోపించారు. అయితే ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అంటూ రాజయ్య సమాధానం ఇచ్చారు.

తాటికొండ రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారు : మహిళా సర్పంచ్ సంచలనం
జానకిపురం మహిళా సర్పంచ్ నవ్య తాటికొండ రాజయ్య పై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, పార్టీ కార్యక్రమాలకు వెళితే పక్కనే నిలబడి భుజాలపై చేతులు వేసి ఒత్తుతున్నాడని, తన మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని చెప్పాడని, ఇక తన కోరిక తీరిస్తే పార్టీలో మంచి స్థానం ఉంటుందని చెబుతూ, నిరాకరిస్తున్నందుకు అందరిలోనూ అవమానించే తీరులో మాట్లాడుతున్నారని నవ్య సంచలన ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా తన అవమానించారని పేర్కొన్న నవ్య, ఎమ్మెల్యే కోరిక తీర్చలేదు అన్న కారణం తోనే తమకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు.

కాల్ చేసి కోరిక తీర్చమని వేధిస్తున్నాడు
దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానుకోవాలని, ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కచ్చితంగా అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నవ్య విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆమె బిడ్డలాంటిదాన్ని అని చెప్పిన మారకుండా తనను ఇబ్బంది పెడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాల్ చేసి మరీ తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడంటూ మండిపడ్డారు. తనకు సహకరించకపోతే నా బతుకు నాశనం చేస్తా అన్నట్టు ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నారంటూ నవ్య మండిపడ్డారు.

సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్ర.. టికెట్ కోసమే ఇదంతా: తాటికొండ రాజయ్య
అయితే ఇదంతా సొంత పార్టీలోని నాయకులు వెనుక ఉండి చేస్తున్న కుట్ర అంటూ తాటికొండ రాజయ్య ఆరోపిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తనకు టికెట్ రాకుండా చేయాలని ఇలా చేస్తున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో తనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు అంటూ ఎమ్మెల్యే రాజయ్య చెబుతున్నారు. ఇక త్వరలో సీఎం కేసీఆర్ ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని పేర్కొన్న ఆయన, ఇది తనపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు.

కాల్ రికార్డింగ్స్ బయట పెడతా అంటున్న మహిళా సర్పంచ్
అయితే దీనిపై స్పందించిన జానకిపురం ఎమ్మెల్యే నవ్య తన వెనుక ఎవరూ లేరని స్పష్టం చేశారు. తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసమే తాను బయటకు వచ్చి మాట్లాడుతున్నానంటూ తేల్చి చెప్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎక్కువ మాట్లాడితే అన్ని ఆధారాలను బయట పెడతానని, ఎమ్మెల్యే మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్ని తన వద్ద ఉన్నాయని నవ్య స్పష్టం చేశారు. సమయం చూసి అవన్నీ కచ్చితంగా బయట పెడతానంటూ ఆమె తేల్చి చెప్తున్నారు.

ఈ వివాదం వెనుక కడియం శ్రీహరి? రాజయ్య అనుమానం
మరి జానకిపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్యల మధ్య చోటు చేసుకున్న వివాదం ఏమలుపు తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే వీరిద్దరి వివాదం నేపథ్యంలో సర్పంచ్ నవ్య వెనుక కడియం శ్రీహరి ఉన్నట్టుగా రాజయ్య అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా స్థానికంగా చర్చ జరుగుతుంది. ఎన్నికల టికెట్ కోసమే తన పైన ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారన్న అభిప్రాయం రాజయ్య వ్యక్తం చేస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications