Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు: అంతర్జాతీయ మహిళాదినోత్సవం నాడు శుభవార్త చెప్పిన మంత్రి!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సాధికారత దిశగా అడుగులు వేసే క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విషయాలను వెల్లడించారు.

హైదరాబాద్ tsrtc కళాభవన్ లో నిన్న గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ తో పాటు, మేడారం జాతరలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులకు, దసరా లక్కీ డ్రా విజేతలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. tsrtc ఎండి సజ్జనార్ తో కలిసి, మంత్రి పొన్నం ప్రభాకర్ 157 మంది ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను అందజేసి వారిని సన్మానించారు.

Women drivers in RTC Telangana Minister said good news on International Women s Day

ఈ క్రమంలో tsrtc ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఆర్టీసీ సంస్థలో మహిళా డ్రైవర్ల నియామకంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. సంస్థల మహిళా డ్రైవర్లను నియమించుకునే అంశాన్ని పరిశీలించాలని ఆర్టిసి ఎండి సజ్జనార్ కు సూచించారు.

మహిళలకు డ్రైవర్లుగా అవకాశాలు కల్పించడంతో కూడా ఆర్టీసీలో సమాన అవకాశాలు దక్కినట్టు అవుతుందని ఆయన వెల్లడించారు.ఇక ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం హలో భాగంగా అత్యుత్తమ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను ఎంపిక చేసి వారికి అవార్డులు అందజేయాలని ఆయనకు సూచించారు.

ఆర్టీసీలో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులను తెలంగాణా ఆర్టీసీ కొనుగోలు చేస్తుందని, కొత్త బస్సులకు అనుగుణంగా సంస్థలో నియామకాలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇక rtc ఉద్యోగుల నుంచి సలహాలు సూచనలు కూడా సంస్థ స్వీకరిస్తుందని, ఆర్టీసీని ప్రగతి పథంలో నిలపడం అందరి ముందు ఉన్న బాధ్యత అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.తాజాగా మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో ఆర్టీసీలో మహిళా డ్రైవర్ లుగా మహిళలకు అవకాశం రానుందని తెలుస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+