లోక్ సభ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే కీలకం .. 10 స్థానాలను శాసించేది వారే

Recommended Video

    Lok Sabha Elections 2019 : Women's Votes Will Play A Key Role In The Upcoming Elections | Oneindia

    రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మహిళల ఓట్లు కీలక భూమిక పోషించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాలలో పది స్థానాలలో మహిళా ఓటు బ్యాంకు కీలకం కానుంది. ఇక ఏడు చోట్ల మాత్రమే పురుష ఓటర్ల ఆధిక్యం కనబడుతోంది. ఈ ఐదేళ్లలో 13.4 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.

    లోక్ సభ ఎన్నికల్లో మహిళలు ఎవరిని ఆదరిస్తే వారే విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటు బ్యాంకు విజయావకాశాలపై ప్రభావం చూపించనుంది. దీంతో మహిళలు ఏ పార్టీని ఆదరిస్తే ఆ పార్టీ జెండా ఆ లోక్ సభ నియోజకవర్గాల్లో ఎగరనుంది. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో చూసినట్లయితే మొత్తం ఓటర్లు 2,95,18,956 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు1,46, 74,973 మంది ఉన్నారు. ఇక పురుష ఓటర్ల విషయానికి వస్తే 1, 48,42,615 గా ఉంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ పరిధిలోని 17 లోక్సభ స్థానాలలో 2,81,73,254 మంది ఓటర్లుండగా ప్రస్తుతం 13,45,710 మంది ఓటు హక్కు నమోదు చేసుకోవడంతో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

    Lok Sabha elections

    పురుష ఓటర్ల సంఖ్య మహిళా ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయా నియోజకవర్గాల వారీగా చూస్తే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా కనిపిస్తుంది.

    ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్లగొండ వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇక మిగిలిన ఏడు స్థానాల్లోనూ పురుష ఓటర్లు విజయావకాశాలను ప్రభావితం చేస్తారు.రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా మల్కాజ్ గిరి ముందు వరుసలో నిలిస్తే అతి తక్కువ ఓటర్లున్న లోక్సభ స్థానం గా మహబూబాబాద్ నిలిచింది. మల్కాజ్ గిరి ఓటర్ల సంఖ్య చూస్తే 30,98,816 మంది కాగా మహబూబాబాద్ ఓటర్ల సంఖ్య 14,14,210 మందిగా ఉంది. ఏది ఏమైనా రానున్న లోక్ సభ ఎనికల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా కనిపిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+