Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Women's day 2025: శ్రీనిధి తెలంగాణా పిండివంటలు.. గరిటె తిప్పే చేతులు సాధించిన విజయం!

ఒక మహిళ మదిలో మెదిలిన ఆలోచన ఎంతో మంది మహిళలకు జీవితాన్ని ఇచ్చింది. సంకల్ప బలం ముందు ఏదీ గొప్పది కాదని నిరూపించింది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది. నలుగురితో కలిసి పనిచేస్తే కనీసం ఆ పని విలువైన తెలుస్తుంది అని భావించిన నలుగురు మహిళలు ఇప్పుడు మహిళా లోకానికే ఆదర్శం అయ్యారు. గరిట తిప్పగల చేతులతోనే ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు దూసుకుపోతున్నారు.

నలుగురితో మొదలైన ప్రయాణం.. వందకు పైగా మహిళలకు భరోసా
హనుమకొండలో నలుగురు మహిళలతో ప్రారంభమైన శ్రీనిధి తెలంగాణ పిండివంటలు ఇప్పుడు వంద మందికి పైగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది. ఒక మంచి ఫుడ్ ఇండస్ట్రీ గా తయారైంది. ఈ పిండివంటల ఇండస్ట్రీ ఈ ప్రాంత మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా అండదండలను అందిస్తుంది. నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే మహిళలు నేర్చుకోలేని ఏ విద్య లేదు. సాధించాలన్న తపన ఉంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదు.

Women s Day 2025 Srinidhi Telangana Pindivantalu is a symbolic of women empowerment

సాంప్రదాయ పిండివంటలు రుచి చూపించాలనే ఉద్దేశం
కేవలం వంటింటికే పరిమితమైన మహిళలు తమకు తెలిసిన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని నమ్ముకొని మొదలుపెట్టిన ప్రస్థానం అప్రతిహతంగా ముందుకు సాగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామానికి చెందిన ధన్నపునేని రాజేశ్వరరావు, రాధ దంపతులకు నలుగురు పిల్లలు. వీరంతా సాంప్రదాయ పిండివంటలను రుచి చూస్తూ పెరిగినవారు. నేటి తరానికి కూడా సాంప్రదాయ పిండివంటలను రుచి చూపించాలన్న ఉద్దేశంతో రమా ,ఉమా, ఉష ముగ్గురు అక్కాచెల్లెళ్లు , మరదలు అర్చన దీనిని ప్రారంభించారు.

Women s Day 2025 Srinidhi Telangana Pindivantalu is a symbolic of women empowerment

15 దేశాలకు పిండివంటలు ఎగుమతి
2016 మే రెండవ తేదీన ప్రారంభించిన ఈ శ్రీనిధి తెలంగాణ పిండివంటలు ప్రస్తుతం 100 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. ఇక్కడి నుంచి దాదాపు 15 దేశాలకు పిండివంటలు ఎగుమతి అవుతున్నాయి. ఇక మన దేశంలో కూడా యూపీ, ఢిల్లీ, చెన్నై వంటి అనేక చోట్లకు పిండివంటలను ఎగుమతి చేస్తున్నారు. ఇక పిండివంటలలో ఎన్ని వెరైటీలు ఉంటాయో అన్ని వెరైటీల పిండి వంటలను చేసి ప్రజలకు రుచి చూపిస్తున్నారు.

Women s Day 2025 Srinidhi Telangana Pindivantalu is a symbolic of women empowerment

పబ్లిసిటీ అవసరం లేకుండానే సూపర్ మార్కెటింగ్
క్వాలిటీ, శుభ్రత, రుచి ఈ మూడింటికి పెద్దపీట వేసి ఇక్కడ పిండి వంటలను తయారు చేస్తారు. అందుకే ఎటువంటి పబ్లిసిటీ అవసరం లేకుండానే తమ పిండివంటల కోసం జనం ఎంతో ఇష్టంగా వస్తారని వారు చెబుతున్నారు. తాము పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదని కష్టించి పనిచేయటమే మొదటి నుంచి తెలుసని శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు నిర్వాహకులు చెప్తున్నారు.

Women s Day 2025 Srinidhi Telangana Pindivantalu is a symbolic of women empowerment

మహిళలకు అండగా పిండివంటల ఇండస్ట్రీ
ఇంతమంది మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ పని ఇవ్వగలుగుతున్నందుకు సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇక శ్రీనిధి తెలంగాణ పిండివంటలలో పనిచేస్తున్న మహిళలు సైతం అంతకుముందు తాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడ్డామని ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో ఆ ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు.
పిండివంటలు మాత్రమే కాదు పచ్చళ్ళు, కారప్పొడి, నాన్ వెజ్ పచ్చళ్ళు ఇలా ప్రజల డిమాండ్ మేరకు తయారు చేసి విక్రయిస్తున్నారు.

Women s Day 2025 Srinidhi Telangana Pindivantalu is a symbolic of women empowerment

వెబ్ సైట్ కి భారీగానే ఆర్డర్లు
ఇక్కడి నుంచి యూఎస్ కి ఎక్కువగా ఎక్స్ పోర్ట్ క్వాలిటీ పిండివంటలు, పచ్చళ్ళు వెళతాయి. శ్రీనిధి తెలంగాణ పిండివంటల పేరుతో ఉన్న వెబ్సైట్ కి కూడా భారీగానే ఆర్డర్లు వస్తున్నాయి. SrinidhitelanganaPindiVantalu.com లో మీకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి పనిచేసే మహిళలు ఆడుతూ పాడుతూ సరదాగా తమ విధులను నిర్వర్తిస్తారు. పని రానివారికి సైతం ఎంతో ఓపికతో పని నేర్పించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు.

నారీ శక్తికి అద్దం పట్టిన శ్రీనిధి తెలంగాణా పిండివంటలు
శుభ్రతకు, నాణ్యతకు పెద్దపీట వేసి అత్యంత రుచికరంగా పిండి వంటలు తయారుచేసి శ్రీనిధి తెలంగాణ పిండి వంటలకు ఒక బ్రాండ్ ను క్రియేట్ చేశారు. తాము మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని తెలియకుండానే వీరంతా దూసుకుపోయారు. తమతో పాటు ఎంతోమంది మహిళలు జీవితాలలో వెలుగులు నింపి నారీ శక్తికి అద్దం పట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+