Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

28న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత: ఎందుకంటే?

హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అక్టోబర్ 28న మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. అక్టోబర్ 28న సాయంత్రం నాలుగు గంటల నుంచి 29వ తేదీ ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తారు.

చంద్ర గహణానికి ముందు రోజు అంటే అక్టోబర్ 27వ తేదీ రాత్రి 7 గంటలకు శరత్ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా 28వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని మూసివేసి.. తిరిగి 29వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు తెరిచి సంప్రోక్షణ చేస్తామని ఆలయ ప్రధాన అర్చకులు నందింగల్ లక్ష్మీనరసింహచార్యులు తెలిపారు.

yadadri sri lakshmi narasimha swamy temple will be closed on october 28th due lunar eclipse

చంద్ర గ్రహణం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వారి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను కూడా మూసివేయనున్నారు.

అశ్వయుజ మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవిస్తుందని.. 2.22 గంటల వరకు ఉంటుందని అర్చకులు తెలిపారు. గంటా 16 నిమిషాలపాటు గ్రహణ సమయం ఉంటుందని.. దీన్ని అంశిక గ్రహణంగా పిలుస్తారని ఆయన తెలిపారు. 2023లో భారతదేశంలో కనిపించే ఏకౌక చంద్ర గ్రహణం ఇదే కావడం గమనార్హం. చంద్ర గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఆలయాలు కూడా మూసివేయనున్నారు. శ్రీకాళహస్తి మినహా అన్ని ఆలయాలు అక్టోబర్ 28న మూసివేసే అవకాశం ఉంది. గ్రహణం పట్టని ఆలయంగా శ్రీకాళహస్తి ప్రసద్ధి చెందిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+