లాడ్జిలో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం.. యాదగిరిగుట్ట తీసుకెళ్లి.

నేటి సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో దారుణమైన ఘటన జరిగింది. ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు నిందితులతోపాటు లాడ్జి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అల్వాల్ కు చెందిన ముగ్గురు తొమ్మిదో తరగతి బాలికలు బడి ఎగ్గొట్టి తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు బాలికలతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నాడు. సదరు యువకుడు మరో ఇద్దరు స్నేహితులను పిలిపించుకుని బాలికలను పరిచయం చేశాడు. అలా యాదగిరిగుట్ట దైవ దర్శనం అని నమ్మించి ముగ్గురు బాలికలను యువకులు తీసుకెళ్లారు. దర్శనం అనంతరం బాలికలను యువకులు ఓ లాడ్జిలోకి తీసుకెళ్లారు. రాత్రంతా బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు.

Yadagirigutta Horror Three Minors Lured for Picnic Raped by Beasts Shocking Details Emerge

అనంతరం బాలికలను హైదరాబాద్ లో వదిలి పరారయ్యారు. పిల్లలు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు నిలదీశారు. ఈ క్రమంలో అత్యాచార విషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు. ఇదే ఘటనపై అల్వాల్ పీఎస్ లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు, లాడ్జ్ ఓనర్ ను అదుపులోకి తీసుకున్న అల్వాల్ పోలీసులు.. నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+