year ender 2023: ప్చ్.. పవన్ కళ్యాణ్ ను వెంటాడిన దురదృష్టం!!

2023 సంవత్సరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం కలిసి రాలేదు. 2023 సంవత్సరంలో కూడా జనసేన రాజకీయాలలో తన ప్రభావాన్ని చూపించలేక పోయిందని తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా అర్థమవుతుంది. ఈ ఏడాది దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన జనసేన ఏపీలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపితో పొత్తు పెట్టుకుంది.

జనసేనకు బలం పెరుగుతుందని ఏపీలో ప్రచారం జరుగుతున్న సమయంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ఘోర పరాజయం పాలు కావడం జనసేన పరిస్థితిని చెప్పకనే చెబుతుంది. పవన్ కళ్యాణ్ ను ఈ ఏడాది దురదృష్టం వెంటాడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీతో కలిసి పొత్తుల నేపథ్యంలో ఎన్నికల బరిలోకి దిగింది జనసేన.

year ender 2023: this year unlucky to pawan kalyan.. defeat in telangana elections

బిజెపితో పొత్తులలో భాగంగా కూకట్ పల్లితో పాటు, కోదాడ, తాండూరు, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా, నాగర్ కర్నూల్ మొత్తం ఎనిమిది స్థానాలలో జనసేన అభ్యర్థులను బరిలోకి దింపారు పవన్ కళ్యాణ్. అంతేకాదు జనసేన అభ్యర్థుల కోసం అలాగే బిజెపి అభ్యర్థుల కోసం కూడా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం పైన కూడా భవిష్యత్ లో ఫోకస్ చేస్తానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.

అయితే పవన్ కళ్యాణ్ చరిష్మా తెలంగాణ రాష్ట్రంలో పనిచేయలేదు. కనీసం ఒక నియోజకవర్గంలో కూడా జనసేన ప్రభావం చూపించలేదు. ఒక్క కూకట్ పల్లిలో మాత్రమే ఓ మోస్తారు ఓట్లు సాధించిన జనసేన అక్కడ మూడో స్థానానికి పరిమితమైంది. మిగిలిన అన్నిచోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి వంటి ప్రాంతంలో కూడా జనసేన సత్తా చాటలేకపోయింది.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి అనవసరంగా అభాసుపాలయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలు కావడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జనసేనకు అటువంటి ఫలితాలే వస్తాయని, తెలంగాణ ఫలితాలు ఏపీలో జనసేనకు రిపీట్ అవుతాయని పవన్ కళ్యాణ్ ను వైసిపి నేతలు టార్గెట్ చేస్తున్నారు.

బర్రెలక్క కన్నా జనసేన పరిస్థితి మెరుగ్గా ఉందని పవన్ కళ్యాణ్ ను ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా పోటీ చేసి, ఓటమిపాలైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీతో తలనొప్పిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో 2023 సంవత్సరంలో కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అర్థమవుతుంది. ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ కు ఎన్నికలు కలిసి రాలేదని స్పష్టంగా తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+